మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం కూడా ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఇది చాలా ప్రధానమైనది.. అంతేకాకుండా కాలేయం వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి కాలేయం దాన్ని సాధారణ పనితీరును కోల్పోతే మనం మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో ఏవైనా సమస్యలుంటే వాటిని పారదర్శకంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే మన కాలేయం పాడయిందా లేదా దాని లక్షణాలు శరీరంలో ఎలా కనిపిస్తాయో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1). మన శరీరం పసుపురంగులో మారడానికి ముఖ్యకారణం కామెర్ల వ్యాధి. కళ్ళలోని తెలుగు రంగు కు కారణం అవుతుంది.. ఇక అంతే కాకుండా మూత్రం కూడా పసుపు రంగులో ఉంటుంది. ఇది కాలేయం దెబ్బతినడానికి స్పష్టమైన సంకేతాలు.

2). కాలేయం సాధారణ పరిస్థితులు చెదిరినప్పుడు చర్మం కింద మనకు ఎన్నో లవణాలు చేరుకుంటాయి. దీని ఫలితంగా దురద రావడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల పిత్త , లవణాలు దురదలకు కారణమవుతాయి.

3). మన శరీరంలో ఉండే కాలేయంలో ఉత్పత్తి అయ్యే పైత్యరసం మన శరీరంలో ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీని ఫలితంగా ఆకలి తగ్గి కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

4). మరి ఏవైనా గాయాలు తగిలినప్పుడు అవి మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటే అది కాలేయ సమస్య ఉందని అర్థం. ఇలాంటి సందర్భాలలో మనం వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యము. ఎందుచేతనంటే నిర్దిష్ట ప్రోటీన్లు లేకపోవడం వల్ల మన శరీరంలో రక్తం గడ్డకట్టదు. ఈ ప్రోటీన్ కాలేయం లో తయారు చేయబడుతుంది.

5). కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపక శక్తిని కోల్పోవడం, మానసికంగా బాధ పడడం వంటివి జరుగుతూ ఉంటుంది.. ఎందుచేతనంటే కాలేయం రక్తం నుండి విషాన్ని ఫిల్టర్ చేయలేనప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: