మనకు దొరికేటువంటి ఎన్నో కాయలలో ఉసిరికాయలు కూడా ఒకటి. ఇందులో పలు ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా చర్మం, జుట్టు వంటి సమస్యలను కూడా తొలగించడానికి చాలా ఉపయోగపడతాయి. ఉసిరి రసం తాగడం వల్ల మన పై వృద్ధాప్య ప్రభావం చాలానే తగ్గిపోతుందట. ఇక ఉసిరికాయల పేస్టు ముఖానికి రాసినా.. జుట్టుకు రాసినా ఆ సమస్యలు తగ్గిపోతాయని ఆయుర్వేదంలో తెలియజేయడం జరిగింది. ఉసిరికాయలలో నారింజ కంటే ఎక్కువగా ఎనిమిది రేట్లు విటమిన్ సి లభిస్తుంది.అటువంటి ఉపయోగకరమైన ఉసిరి ఉపయోగం అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

1). ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరం పైన ముఖం మీద ఉండే ముడతలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇది స్కిన్ పెగ్మెంటేషన్ ని తగ్గించి మీ ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఉసిరిలో ఉండే విటమిన్లు, కొల్లోజెన్ వల్ల చర్మం నునుపు గా , యవ్వనంగా కనిపిస్తుంది.

2). ఉసిరిలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ సి వల్ల చర్మం మెరిసేలా చేయడమే కాకుండా వృద్ధాప్యం తరువాత కూడా చర్మం వేలాడకుండా ఉంటుంది. ఒక స్పూన్ ఉసిరి పొడిని తీసుకొని కాస్త గోరువెచ్చని నీటిలో కలుపుకొని ముఖానికి స్క్రబ్ లాగా చేసుకున్నట్లు అయితే పలు ప్రయోజనాలు ఉంటాయి. ఇక అంతే కాకుండా ఉసిరితోపాటు కాస్త తేనెను కూడా కలిపి రాయడం వల్ల ముఖం అందంగా మెరుస్తుంది.

3). ఉసిరి రసం మృత కణాలను తొలగించడం వల్ల చర్మం చాలా శుభ్రపడుతుంది. ఇది చర్మాన్ని లోపల నుండి శుభ్రపరిచేలా చేస్తుంది. ఉసిరి రసం ముఖం పైన అప్లై చేసిన తర్వాత కొన్ని నిమిషాలకు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకున్నట్లు అయితే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

4). ఉసిరికాయలలో ఊరగాయ తినడం వల్ల సులభంగా జీర్ణం అవ్వడమే కాకుండా ఎముకలు కూడా చాలా దృఢంగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: