
వర్షాకాలం వచ్చే ముందు కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. లేకపోతే రోగాల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనలో రోగనిరోధక శక్తి బలపడాలి. అప్పుడే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇక వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది . కాబట్టి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం నిషిద్ధం. ఇక ఈ సీజన్లో బ్యాక్టీరియా ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకోవద్దు. సీ ఫుడ్ కూడా తక్కువగానే తీసుకోవాలి . వర్షాకాలంలో సముద్రపు నీరు కలుషితమై ఇన్ఫెక్షన్లు వస్తాయి.
ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సీజన్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. అలాగే కొన్ని ఆహార పదార్థాలను దూరం చేయాలి. ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరిని తీసుకోవాలి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తో కూడిన అవిస గింజలు, బాదంపప్పులు, వాల్నట్ వంటివి సూపర్ ఫుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బెర్రీలు, చెర్రీ , తాజా ఖర్జూరాలు, దానిమ్మ వంటివి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.