వంటగదిలో చీపురులను అసలు ఉంచకూడదు. వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ శుభ్రం చేసేటువంటి చీపురును వంట గదిలో ఉంచకూడదు. వంట గదిలో చీపురును ఉంచినట్లు అయితే ఆ ఇంట్లో తిండికి కొరత ఏర్పడుతుందట. ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
వంట గదిలో మనం వేసుకొనే మందులను అసలు ఉంచుకోకూడదు. సాధారణంగా మాత్రలు వంటగదిలో ఉంచకూడదు ఎందుచేత అంటే ఇది కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
వంటగదిలో మనం అద్దం ఉంచకూడదు. వాస్తు ప్రకారం వంటగదిలో ఎప్పుడైతే అద్దాన్ని ఉంచినట్లయితే వారి జీవితం కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.
వంట గదిలో ఏదైనా విరిగిన పాత్రలను, వస్తువులను సైతం ఉంచకూడదు.కొంతమంది మహిళలు విరిగిన పాత్రలను ఉంచుతారు. ఇవి వాస్తు ప్రకారం చాలా ఇబ్బందిని కలిగిస్తాయట. ముఖ్యంగా ఏవైనా తుప్పు పట్టిన వాటిని ఉంచకూడదట ఇవి రోగాల బారిన పడేలా చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
వాస్తు ప్రకారం వంటగదని వాస్తు నిపుణులతో ఆధారంగా ఏ మూల ఉంచాలో ఆ మూల ఉంచితే చాలా మంచిది. లేకపోతే పలు అనర్థాలకు దారితీస్తుందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి