సర్వేంద్రియం నయనం ప్రదానం అన్నారు పెద్దలు. ఎందుకంటే కళ్ళు లేనిదే ఒక చిన్న పని కూడా మనం చేసుకోలేము.ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ఎక్కువ చూడడం,మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల,కంటిచూపు దెబ్బ తిని చిన్నపెద్ద తేడా లేకుండా చాలామంది కంటి అద్దాలు,లెన్స్ వాడడం వంటివి చేస్తూ ఉన్నారు.వాటి అన్నిటికి దూరం ఉండాలంటే మనం తినే ఆహారమే మనకు సగం బలం చేకూరుస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అస్సలు కంటికి ఆరోగ్యాన్ని పదిలం చేసే ఆహారాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండీ..

బాదం..
రోజుకు ఐదు నుంచి ఆరు బాదం విత్తనాలను తీసుకోవడం వల్ల,ఇందులోని విటమిన్ ఈ కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను కూడా తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందట.అంతేకాక కంటిలో శుక్లాలు దరి చేరకుండా కాపాడుతుంది.

క్యారెట్..
రోజుకు ఒక చిన్న బౌల్ క్యారెట్ ముక్కలను తీసుకోవడం వల్ల,కంటి ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు.ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ మరియు బీటా కరోటిన్  పుష్కలంగా లభించి,కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

కాళీ..
ఇది ఒక రకమైన నాచు మొక్క.చూడటానికి నీళ్లపై ఉండే  పాచిలాగా ఉంటుంది.దీనిని తీసుకోవడం వల్ల కంటికి అవసరమైన విటమిన్స్,న్యూట్రియన్స్ మరియు మినరల్స్  పుష్కలంగా లభిస్తాయి.ఎవరైతే వృద్ధులు కంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఆరెంజ్..
చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు రోజుకోక ఆరంజ్ తీసుకోవడం వల్ల,ఇందులోని విటమిన్ సి బ్లడ్ వైజల్స్ ని యాక్టీవ్ స్టేజ్ లో ఉంచి కంటి సమస్యలు దరిచేరకుండా కాపాడటంలో ముందుంటుందని చెప్పవచ్చు.

గుడ్డు..
రోజుకొక గుడ్డు తీసుకోవడం వల్ల,ఇందులో ఉన్న కాల్షియం మరియు విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి. జింక్,ల్యూటీన్ అనే పదార్థం కంటి ఆరోగ్యాన్ని వైటల్ రోల్ ప్లే చేస్తాయని చెప్పవచ్చు.ఇంకెందుకు ఆలస్యం మీ కంటి ఆరోగ్యాన్ని పదలంగా ఉంచుకోవడానికి పైన చెప్పిన ఆహారాలన్నీ తీసుకొని,ఎటువంటి కంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: