పెళ్లి కోసం యువత ఎక్కువగా అప్పులు చేస్తూ ఆడంబరాలకు పోతూ అనంతరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఫ్రీ వెడ్డింగ్ షూట్ మెహందీ ఫంక్షన్ లాంటివి చేసుకోవడానికి ఒక్కో జంట దాదాపు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. దీనికోసం అనేక రకాల ప్రాంతాలను తిరగడం వెడ్డింగ్ షూట్ చేసుకోవడం ఆ షూట్ ని ఫేస్బుక్, వాట్సప్ ఇతర సామాజిక మాధ్యమాల వేదికల పై ఉంచి ఆనందాన్ని పొందడం జరుగుతోంది.


అయితే ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ ల వల్ల మెహేంది ఫంక్షన్ల వల్ల చాలా వరకు అప్పులు చేస్తున్నారు. గొప్పింటి కుటుంబాలు చేసుకునే ఇలాంటి ఫంక్షన్లను సాధారణంగా ప్రస్తుతం పేదవారు మధ్యతరగతి వారైనటువంటి వారు కూడా చేసుకోవడం వల్ల చాలా వరకు అప్పులవుతున్నాయి. చాలామంది పెళ్లి ఒకేసారి చేసుకుంటాను మళ్లీ మళ్లీ చేసుకుంటామా అని అనుకుంటూ ఎక్కడి నుంచో ఎక్కువగా అప్పులు తెచ్చుకుంటూ అంబరాన్ని అంటే సంబరాలతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.


గతంలో పెళ్లిళ్లు అంటే మంచి విందు భోజనం ఉన్నత స్థాయిలో అతిథులకు చక్కటి భోజనం అందించి వారి ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ మెహందీ ఫంక్షన్ రిసెప్షన్ లాంటి కార్యక్రమాలతో విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేస్తున్నారు. అయితే పెళ్లి అయిన తర్వాత భార్య భర్త కలిసి ఎక్కడికైనా వెళ్లాలన్నా వివిధ ప్రాంతాలను తిరగాలన్న కూడా పెళ్లికి ముందు చేసిన అప్పులే తీర్చలేక పెళ్లయిన తర్వాత ఎటు వెళ్లలేకపోతున్నారు.


తద్వారా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కానీ పెళ్లికి ముందు విచ్చలవిడి ఖర్చు పెట్టడం అనేది తగ్గిస్తే పెళ్లి అయిన తర్వాత సంతోషంగా ఉండచ్చనే భావన తెలుసుకోవాలి. ఇళ్లల్లో పెద్దలు చెబుతున్నప్పటికీ కూడా చాలా మంది యువత పట్టించుకోకుండా పెళ్లికి ముందే విచ్చలవిడి ఖర్చు చేయడం వలన పెళ్లి అయిన తర్వాత తాము అనుకున్న విధానంలో జీవించలేక అప్పులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: