సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండడం అనేది సర్వసాధారనమే.కానీ కొంతమంది వారు ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు ఉంటారు.దానికి కారణం వారిలో ఉన్న హార్మోనల్ సమస్యలు,వంశపారంపర్యము, ఆహారపు అలవాట్లు,జీవన శైలి కారణంగా అధిక బరువు అవుతూ ఉంటారు.మరి ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా వెంటాడుతోంది.ఇలా అధిక బరువు ఉన్నవారు నలుగురులో కలవాలన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటారు.ఇలానే కొనసాగితే వారిపై వారు నమ్మకం కోల్పోయి,ఆత్మవిశ్వాసం దెబ్బతిని,ఏ పని చేయాలన్న వెనకడుగు వేస్తూ వుంటారు.

మరియు అధిక బరువు ఉన్నవారు మానసికంగా బాధపడటమే కాక, శారీరకంగా కూడా చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదిలా కొనసాగితే ప్రాణాంతకం  కూడా అవ్వొచ్చు.అసలు అధిక బరువు అవుతే ఎలాంటి సమస్యలు మన చుట్టూ ముడతాయో మనము తెలుసుకుందాం పదండి..

అధిక బరువు ఉన్నవారికి అతిపెద్ద సమస్య నడవలేకపోవడం.చిన్న దూరం కూడా అధిక బరువు సమస్యతో నడవలేకపోతూ ఉంటారు.దీనితో ఎక్కడ కూర్చున్న వారు అక్కడే ఉండడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది.అధిక బరువు సమస్యతో అధికంగా తినాలని కోరిక కూడా పెరుగుతుంది.దాంతో రక్తంలో ఉండాల్సిన గ్లూకోజ్ లెవెల్స్ కన్నా అధికంగా ఉండి, మధుమేహం బారినపడే అవకాశం ఉంటుంది.

అధిక బరువును చెడు కొలెస్ట్రాల్ పెరిగి,గుండె సమస్యలు కూడా కలుగుతాయి.అధిక బరువు ఉన్నవారికి ఫ్యాటీ లివర్ అనేది సర్వసాధారణమే.ప్యాటి లివర్ సమస్య తగ్గించుకోకపోతే రక్తాన్ని శుద్ధపరిచే ప్రక్రియ ఆగిపోతుంది.మరింత గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.అంతేకాక అధిక బరువు వల్ల మెటబాలిక్ రేటు తగ్గిపోయి,ఎప్పుడూ నీరసంగా నిస్సత్తుగా,అనాశక్తిగా ఉంటారు.ఇటువంటివారిలో పని చేయాలని కోరిక కూడా తగ్గిపోతూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి,చాలా మంది అధిక బరువును తగ్గించుకోవడానికి మిడిమిడి జ్ఞానంతో వారికి వారే డైట్లు రూపొందించుకుంటూ ఉంటారు.కానీ దీని వల్ల వారికి ఎలాంటి సహాయం అందకపోగా, అనవసరమైన దుష్ప్రభావాలను కొనితెచ్చుకుంటూ ఉంటారు.కావున ఎవరైతే అధిక బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారో అలాంటివారు డైటీషియన్ ని కలిసి,వారు రూపొందించే డైట్ ని ఫాలో అవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: