
శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. పెరుగు లో ఉండే ప్రొబయోటిక్స్ లైవ్ బ్యాక్టీరియా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చక్కెర తక్కువ పరిమితిలో ఉన్నప్పుడు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొన్ని ఔషధ గ్రంథాల ప్రకారం, పెరుగు చక్కెర కలిపి తినడం మైండ్‌కి ఓ ప్రశాంతతనిచ్చే ఆహారం. స్ట్రెస్ ఉన్నప్పుడు కొంతమంది తినితే రిలీఫ్ అనిపించవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి మధ్యాహ్న భోజనంలో చిన్న మొత్తంలో తీసుకోవచ్చు. చక్కెర కలిపిన పెరుగు తరచూ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి ఇది హానికరం.
అధిక శర్కర తీసుకోవడం వల్ల ఇన్‌సులిన్‌కు నిరోధం ఏర్పడుతుంది. చక్కెర వల్ల అధిక కేలరీలు శరీరంలో చేరుతాయి. క్రమంగా వాడటంతో బరువు పెరుగుతుంది, శరీరంలోని కొవ్వు శాతం పెరుగుతుంది. పలు ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారం, పెరుగు మరియు చక్కెర కలిపి తినడం వల్ల శరీరంలో అజీర్ణ పదార్థం ఏర్పడి చర్మ సమస్యలు అలర్జీలు, మొటిమలు రావచ్చు. అధిక చక్కెర వాడక వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్న భోజనం తర్వాత తక్కువ పరిమితిలో తినడం మంచిది. రాత్రి సమయంలో పెరుగు+చెక్కెర తినడం టోటల్‌గా తగదు. ఇది జీర్ణక్రియను మందగించిస్తుంది, శరీరాన్ని చల్లబరచడంతో కొందరికి జలుబు, తలనొప్పి వంటివి రావచ్చు.