భారతదేశం అంటేనే భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అభివృద్ధిలో ఎంత దూసుకుపోతున్నా కానీ  సాంప్రదాయాలను మాత్రం మరవడం లేదు.. ముఖ్యంగా ఇప్పటికీ కొన్ని గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో వారి యొక్క సాంప్రదాయాన్ని ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఇందులో చాలామంది ఉద్యోగస్తులుగా సెటిల్ అయినా కానీ వారి సాంప్రదాయం ప్రకారమే అన్ని చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి జరిగితే మొదటి రాత్రి అనేది తప్పకుండా రాత్రి సమయంలోనే నిర్వహిస్తారు. అంతేకాదు ఒక ముహూర్తం చూసి ఒక గదిలో వధూవరులను సెట్ చేసి ఉంచుతారు. కానీ ఈ తెగలో మాత్రం  రాత్రి కాకుండా పగలే దంపతులిద్దరూ కలవాలి. అంతా ఆరు బయటే చేసుకోవాలి.. మరి ఆ తెగ ఎక్కడుంది వివరాలు చూద్దాం.. ప్రస్తుతం కాలం మారింది.. మనుషులు మారుతున్నారు టెక్నాలజీ వైపు అడుగులు వేసి  సంస్కృతి, సాంప్రదాయాలు కూడా మరుస్తున్నారు.

 అలాంటి ఈ తరుణంలో చెంచు జాతులకు చెందినటువంటి గిరిజనులు  ఒక డిఫరెంట్ కల్చర్ ను పాటిస్తూ వస్తున్నారు. ఈ సాంప్రదాయం వారి పెద్దలనుంచి వచ్చిందని కొన్ని వందల ఏళ్ల నుంచి ఇదే పాటిస్తున్నామని వారు తెలియజేస్తున్నారు. అంతేకాదు వీరి సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం కూడా వధూవరులు ఇద్దరికీ ఇష్టం ఉంటేనే చేస్తారు.. అంతే కాదు పెళ్లి కూడా సింపుల్ గా ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకుంటారు. పెళ్లి తర్వాత ప్రధాన ఘట్టం అయినటువంటి మొదటి రాత్రి  ఈ చెంచు జాతుల్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పెళ్లి జరిగిన తర్వాత వధూవరులిద్దరికీ జరిగే శోభనం కార్యక్రమం  నాలుగు గోడల మధ్య కాకుండా  అడవుల్లో చేయాలి. పెళ్లి తర్వాత వధూవరులు ఇద్దరిని ఆహార సేకరణ కోసం  అడవుల్లోకి పంపుతారు. అక్కడే ప్రకృతి ప్రసాదించిన అడవే, పచ్చటీ పందిరి వారికి శోభన గృహం..

అలాగని ఏ రాత్రో వారు కార్యక్రమం చేయరు.. అంతా పగలే చేయాలి.. ఆహార సేకరణ చేయాలన్నా పగలే, శృంగారం చేయాలన్నా పగలే. ఇది చెంచు తెగల ఆనవాయితీ. ఈ విధంగా సాంప్రదాయం పాటిస్తేనే వారి పెద్దలు ఆశీర్వాదం దొరుకుతుందని వారి భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతారు. ప్రస్తుతం పెళ్లిళ్లు చేయాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాదు ఇక వధువు ఉన్నదంటే వారు పెద్ద బరువుగా భావిస్తారు. కట్న కానుకలు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలంటే చాలామంది కుటుంబాలు అప్పుల పాలవుతున్నారు. కానీ ఈ చెంచుల తెగలు మాత్రం పప్పన్నం తప్ప ఎలాంటి హంగు ఆర్భాటాలు  లేకుండా ప్రకృతి ఒడిలోనే పెళ్లిళ్లు చేసుకుని ఒక్కటైపోతారు. ఖర్చు కూడా తక్కువగా అవుతుంది.. ఇందులో ప్రధాన ఘట్టమైనటువంటి శృంగారం కూడా అడవి తల్లి ఒడిలోనే పగలంతా చేస్తూ వారు వారి కుటుంబాలను పెంచుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: