హిందూ ధర్మంలో కృష్ణుడు జన్మాష్టమికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ పండుగను చాలామంది హిందువులు చాలా ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడి బాలరూపమైన లడ్డు గోపాలుడుగా, గోపికగా తమ పిల్లలను సైతం రెడీ చేసి మరి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము కూడా జన్మాష్టమి పండుగ బాత్రపదమాసంలో జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది జన్మాష్టమి ఈరోజున వచ్చింది. జన్మాష్టమి రోజున కొన్ని పనులు చేస్తే శ్రీకృష్ణుడు ఆనందపడతారని శుభ ఫలితాలు కూడా అందుకుంటారని.. మరి కొన్ని పనులు చేయకూడదని చాలామంది నమ్ముతూ ఉంటారు వాటి గురించి చూద్దాం.



శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజున ఉదయం లేవగానే తల స్నానం చేసి వ్రత సంకల్పం తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు పగలు సమయంలో నిద్ర పోకపోవడం మంచిది.


ఈ రోజున ఉపవాసం ఉన్నవారు సగ్గుబియ్యం, పాలు, పెరుగు వంటివి తినడం చాలా మంచిది.


ఈరోజు ఉదయం పూట కృష్ణుడిని దైవభక్తితో పూజించాలి. అయితే ఈ వ్రతాన్ని పూర్తిచేయాలనుకునే వారు అర్ధరాత్రి 12 గంటల తర్వాత వ్రతాన్ని ముగించడం వల్ల సరైన ఫలితాలను అందుకుంటారు.

కృష్ణుడు జన్మాష్టమి రోజున ఇంటికి నెమలీకా తీసుకువస్తే ఆ ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉంటారు.

శ్రీకృష్ణుని విగ్రహాలను కొనుగోలు చేసే సమయంలో ఆవు దూడలతో పాటు కృష్ణుడు ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేసుకోవడం చాలా మంచిది దీని వల్ల ఇంటికి వాస్తు దోషాలు ఉన్న సంతానం దోషాలు ఉన్న తొలగిపోతాయట.

చేయకూడని పనులు:
జన్మాష్టమి రోజున ఎవరూ కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదు అలాంటి దుస్తులు ధరించుకొని పూజలో కూడా ఉండకూడదు.


వ్రత సమయంలో కూడా ఆహారం మరియు ఉప్పు తీసుకోకుండా ఉండాలి.


ఈరోజు ఎవరితోనూ ఎలాంటి గొడవ పెట్టుకోకూడదు అలాగే ఎవరూ కూడా దుర్భాషలు ఆడకూడదు.. ముఖ్యంగా మాంసాహారం, మద్యం వంటివి తినకపోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: