
నూడిల్స్‌లో పిండిపదార్థాలు, శుద్ధి చేసిన పిండి, నూనె, రుచిని పెంచే రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం వీటిని తినడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు. నూడిల్స్‌లో కేలరీలు మరియు పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా వీటిని తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు సమస్య వస్తుంది. నూడిల్స్‌లో ఉండే మైదా పిండి, ట్రాన్స్ ఫ్యాట్స్ లాంటివి శరీర బరువు పెరగడానికి కారణమవుతాయి.
నూడిల్స్‌లో ఫైబర్ ఉండదు కాబట్టి అవి సులభంగా జీర్ణం కావు. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. తరచూ నూడిల్స్ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూడిల్స్‌లో మోనోసోడియం గ్లూటామేట్ (MSG) వంటి రుచిని పెంచే పదార్థాలు ఉంటాయి. ఇవి తలనొప్పి, అలసట, గుండె సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. అలాగే నూడిల్స్‌లో అధికంగా ఉండే సోడియం రక్తపోటును పెంచి గుండె జబ్బులకు దారితీస్తుంది.
నూడిల్స్ తినడం పూర్తిగా మానేయడం కష్టం కాబట్టి, వాటిని పరిమితంగా తినాలి. వారంలో ఒకటి లేదా రెండు సార్లు తినడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. వీలైనంత వరకు నూడిల్స్‌కు బదులుగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు వంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నూడిల్స్ ఎక్కువగా తింటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉంటుంది.