
ఈ విధంగా చేయడం ద్వారా జిల్లా, ఏరియా ఆస్పత్రులతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సైతం వైద్య సేవలు మరింత మెరుగయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. పల్లెలకు సైతం స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఆలోచనతో ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టు తెలుస్తోంది. ఆరోగ్య శాఖలో ఇప్పటికే దాదాపుగా 8,000 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగగా మరో 7 వేల పోస్టుల భర్తీ జరగనుందని తెలుస్తోంది.
ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వేరేగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. అత్యంత భారీ వేతనంతో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ నెల 8 నుంచి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈ ఉద్యోగ ఖాళీల గురించి పూర్తీ వివరాల కోసం సంబంధిత శాఖ వెబ్ సైట్ ను పరిశీలించాల్సి ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు