మీ టూ ఉద్యమం ఇప్పడూ ఇండియా లో తారా స్థాయికి చేరుకున్నది అయితే మీ టూ గురించి మాట్లాడుతూ చాలా మంది సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తనుశ్రీ దత్త వాఖ్యలతోనే బాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలై ఓ కుదుపు కుదిపేస్తోంది. మీటూ ఉద్యమం వలన ప్రముఖ దర్శకులు, నటుల జాతకాలు బయట పడుతున్నాయి. కానీ రాఖీ సావంత్ మాత్రం మీటూ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

ఆమెలో మగాడి లక్షణాలు

రాఖీ సావంత్ మీటూ ఉద్యమానికి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో తనుశ్రీ దత్తపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. హార్న్ ఓకె ప్లీజ్ చిత్రంలో తనుశ్రీ దత్త తప్పుకున్న తరువాత రాఖీ సావంత్ ని స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసుకున్నారు. రాఖీ సావంత్ తనుశ్రీపై తీవ్రమైన కామెంట్స్ తో రెచ్చిపోతోంది. తనుశ్రీకి డ్రగ్స్ అలవాటు ఉందని అందువలనే ఆ చిత్రాంలోకి నన్ను తీసుకున్నారని పేర్కొంది. రాఖీ సావంత్ వ్యాఖ్యలకు తనుశ్రీ ధీటుగా కౌంటర్ ఇచ్చింది. రాఖీపై 10 కోట్ల పరువునష్టం దావా వేసింది. అయినా కూడా రాఖీ సావంత్ వెనక్కి తగ్గడం లేదు.

 బలవంతం ఉండదు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాఖీ సావంత్ మీటూ ఉద్యమానికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమకు వస్తున్న 99 శాతం హీరోయిన్లు సెక్స్ చేసేందుకు అంగీకారం తెలుపుతారని రాఖీ సావంత్ వ్యాఖ్యానించింది. చిత్ర పరిశ్రమకు వచ్చే అమ్మాయిలు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో వారంతట వారే పడకగదికి వెళతారని రాఖీ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: