అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య సినిమాలు చేయడంలో అందులోనూ కథలు ఎంచుకోవడంలో ఆచితూచి ముందు అడుగు వేస్తున్నారు. అవరేజ్ హీరోలలో ఓ మినిమమ్ గ్యారంటీ ఉన్న హీరోలలో  ఈయన కూడా ఒకరు. ఇక తన భార్య సమంత ఎంత పెద్ద స్టార్ హీరోయినో మనకి తెలుసు. ఈ సినిమాలలో నాగచైతన్య కంటే సమంతనే ఎక్కువ సంపాదిస్తోందనీ సినీ ఇండస్ట్రీలో అనుకుంటుంటారు. అనుకోవడం కాదు.. అదే నిజం. ఆమె సినిమాలలో చేస్తూనే , ఓటీటీలో కూడా పలు షోల ద్వారా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉండగా, మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు టీవీ యాడ్ లలో కూడా పని చేస్తూ బిజీ అయిపోయింది అక్కినేని సమంత.



ఇదిలా ఉండగా ఇటీవల అక్కినేని నాగచైతన్య హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. ఇక దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఇదివరకే నాగ చైతన్య పైన ఫ్యామిలీతో కలిపి  "మనం" ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈయన నాగ చైతన్య తో  థాంక్యూ చిత్రాన్ని తీస్తున్నారు . అయితే ఇందులో రాశికన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో కీలకమైన పాత్రలో"అవికాగోర్"  కూడా నటిస్తుండటం విశేషం.

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మొత్తం సినిమా షూటింగ్ లన్ని నిలిపి వేయడం జరిగింది. దీంతో మొత్తం అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక కరోనా ఉద్రిక్తత కొంచెం తక్కువ అవడంతో, సినిమా షూటింగ్స్ అన్నీ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇక  సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇంకో వారం రోజులపాటు ఈ సినిమా చిత్రీకరణ చేస్తే  పూర్తి అవుతుంది.


ఇక నాగ చైతన్య ఈ చిత్రం పూర్తయిన వెంటనే హిందీ లో నటించనున్న మొదటి చిత్రం"లాల్ సింగ్ చద్దా" అనే సినిమాలో నటించనున్నారు నాగ చైతన్య. ఈ చిత్రంలో స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది అద్వైత చందన్.


మరింత సమాచారం తెలుసుకోండి: