చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున "సంతోషం" అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు దశరథ్  దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తో నాగర్జున కు మంచి విజయం , మంచి గుర్తింపు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాలో మొదట నాగార్జున ను కాకుండా మరో టాలీవుడ్ స్టార్ హీరో ను హీరో గా అనుకున్నారట.

అందులో భాగంగా ఆయనకు కథను కూడా వివరించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నటుడు ఆ సినిమాలో నటించలేను అని చెప్పాడట. దానితో నాగార్జున కు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఇంతకు సంతోషం సినిమా లో మొదట హీరో గా అనుకున్నది ఎవరైనా తెలుసా ..? ఆయన మరి ఎవరో కాదు ... తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్. సంతోషం సినిమా కథ మొత్తం తయారు అయిన తర్వాత దశరథ్ ఈ మూవీ ని వెంకటేష్ తో చేయాలి అనుకున్నాడట.

అందులో భాగంగా వెంకటేష్ ను కలిసి మూవీ కథను కూడా వివరించాడట. కానీ కొన్ని కారణాల వల్ల వెంకటేష్ ఆ సమయం లో ఆ సినిమాలో నటించడానికి అంగీకరించలేదట. దానితో దశరథ్ , నాగార్జున ను కలిసి ఇదే కథను వివరించాడట. నాగార్జున కు ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ సినిమా ద్వారా నాగార్జున కు మంచి విజయం దక్కింది. అలా వెంకటేష్ రిజెక్ట్ చేసిన మూవీ తో నాగార్జున కు మంచి విజయం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: