బిగ్ బాస్ సీజన్ 4 లో ఫైటర్ గా నిలిచిన అరియానా ఆ సీజన్ లో టాప్ 4 గా నిలిచింది. ఆ షోతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆమెకు బిగ్ బాస్ సీజన్ 5 బజ్ ఇంటర్వ్యూస్ చేసే హోస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ ను మొదట ఇంటర్వ్యూ చేసి.. హౌజ్ లో ఉన్న వాళ్ల గురించి.. వెళ్లిపోయిన వాళ్ల గురించి కన్ ఫ్యూజ్ చేసే ప్రశ్నలను అడిగి లేడీ బిగ్ బాస్ గా వ్యవహరించింది అరియానా. ఇక ఆదివారం తో గ్రాండ్ ఫినాలే కూడా ముగిసింది. టాప్ 5లో ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ వచ్చింది అరియానా.

ఈ క్రమంలో అరియానా టాప్ 5గా బయటకు వచ్చిన సిరితో ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో సిరిని ఓ ఆటాడేసుకుంది అరియానా. షణ్ముఖ్ గురించి చెప్పమని అరియానా అడిగితే ఏం చెప్పేది అందరికి తెలిసిందేగా అన్నది సిరి. అప్పుడే అరియానా లేచి సిరికి హగ్ ఇచ్చి ఆంటీ ఫ్రెండ్ షిప్ హగ్గులు మాత్రమే అన్నది. ఇంతలో సిరి గట్టిగా వెళ్లినట్టు ఉన్నాయ్ గా హగ్గులు అని అన్నది. సీజన్ 5లో టాప్ 5లో ఒకే ఒక్క అమ్మాయిగా ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది అరియానా. అందుకు చాలా హ్యాపీగా ఉన్నానని అన్నది సిరి.

బిగ్ బాస్ ప్రయాణంలో సపోర్ట్ తీసుకుని ఆడా అనుకుంటున్నావా లేక ఒంటరిగా ఆడావ్ అనుకుంటున్నావా అని అడిగింది అరియానా. తాను ఒంటరిగా ఆడానని చెప్పింది సిరి. కానీ షణ్ను వద్దు దూరంగా ఉండమని చెప్పాడు కదా అని అరియానా అన్నది. తన ఇన్ టెన్షన్ ఏంటి అంటే అని సిరి మొదలు పెడితే నీ ఇన్ టెన్షన్ చెప్పు బంగారం షణ్ను షణ్ను అని అనకు అన్నది అరియానా. ఇక రవిని నామినేట్ చేసి ఐస్ టాస్క్ లో మళ్లీ రవి కోసం వుయ్ మిస్ యు అని ఎందుకు అన్నరని అడిగింది అరియానా. ఇక సన్నీని నువ్వు టార్గెట్ చేశావా అంటే లేదు మాకు టాస్క్ లో రోజు గొడవ అవుతుందని అనంది సిరి. అంటే షణ్నుతో కూడా గొడవ అవుతుంది కదా అని అడిగింది అరియానా. మోజ్ రూం లో ఉన్న షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి సిరి ఎందుకు ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టింది అని అడిగింది అరియానా. షణ్ముఖ్ తో ఫ్రెండ్ షిప్.. శ్రీహాన్ ఈ రెండిటిలో ఒకటి చూజ్ చేసుకోమంటే సిరి ఆన్సర్ ఏంటని అరియానా తన ప్రశ్నలతో సిరిని కడిగి పారేసింది. జస్ట్ ప్రోమోనే ఇలా ఉంటే ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: