బుల్లితెరపై యాంకర్ రష్మీ  పేరు తెలియని ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక సాదాసీదా యాంకర్గా జబర్దస్త్ షో లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకుంది. ఒక నార్మల్ కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టించింది. బుల్లితెర ప్రేక్షకులందరికీ వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పరిచయం చేస్తూ అందరి చూపు ఆకర్షించడంలో జబర్దస్త్ కార్యక్రమం సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే తక్కువ సమయంలోనే స్టార్ కామెడీ షో గా ఎదిగింది జబర్దస్త్. ఈ క్రమంలోనే ఇక జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ కూడా అంతే క్రేజ్ సంపాదించింది.



 జబర్దస్త్ స్టేజ్ పై పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ తన అందాల ఆరబోతతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తో ఉన్న లవ్ ట్రాక్ తోనే ఈ అమ్మడికి ఎక్కువ క్రేజ్ వచ్చింది అనే చెప్పాలి. బుల్లితెరపై యాంకర్గా కొనసాగుతూనే అటు సినిమాల్లో హీరోయిన్గా అవతారమెత్తింది. ముఖ్యంగా ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన గుంటూరు టాకీస్ సినిమాలో కాస్త బోల్డ్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆ తర్వాత కూడా మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించలేకపోయింది రష్మి. ఇక ఇప్పుడుఈటీవీ లో నిర్వహించే ప్రతి ఈవెంట్ లో కూడా ఈ అమ్మడు సందడి చేస్తూ ఉంటుంది.


కాగా అక్టోబర్ 31వ రోజు స్పెషల్ గా పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు   అని ఈవెంట్ ప్లాన్ చేశారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్లో భాగంగా రష్మీ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ప్రియతమా ప్రియతమా అనే పాట పై డాన్స్ చేసింది రష్మి... ఈ క్రమంలోనే ఒక వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమను తండ్రికి చెబితే తండ్రి అంగీకరించడు. దీంతో ప్రియుడిని వదలలేక ఇక చివరికి తండ్రి కి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది..  తండ్రి పాదాలకు  నమస్కరించి ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది. ఇక ఇదంతా పర్ఫామెన్స్ రూపంలో అదిరిపోయే డాన్స్ చేసి చూపించింది రష్మి. అయితే రష్మి డాన్స్ చేస్తున్నంత సేపు అక్కడే కూర్చున్న లాస్య వెక్కివెక్కి ఏడ్చింది. పర్ఫామెన్స్ ముగియగానే రష్మీ ని వచ్చి గట్టిగా హత్తుకుంది. రష్మీ పర్ఫామెన్స్ చేస్తుంటే నేను చేసింది గుర్తొచ్చింది. ఒకప్పుడు నేను కూడా ఇలాగే చేశాను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: