టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఓటమన్నదే ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరు కొరటాల శివ. ఇప్పటి వరకు తెలుగులో ఈయన తీసిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ చిత్రాలే. రొటీన్ కు భిన్నంగా సినిమాలను తీయడంలో కొరటాల ది అందివేసిన చేయి. అంతే కాకుండా తీసిన ప్రతి సినిమా లోనూ ఈ సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తారు. మంచి పవర్ఫుల్ మెసేజ్ ను తీసుకోవడం అందుకు ఈ తరానికి తగ్గట్లు కమర్షియల్ ఎలిమెంట్స్ జత చేసి ప్రేక్షకులు మెచ్చేలా చిత్రాలు తీయడంలో ఈ దర్శకుడు బాగా దిట్ట. అయితే మొదటి సారిగా తన సినిమాకి నెగటివ్ టాక్ తో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కుంటున్నారు కొరటాల. శుక్రవారం నాడు రిలీజ్ అయిన కొరటాల నూతన చిత్రం ఆచార్య రిలీజ్ అయిన మొదటి షో నుండే నెగటివ్ టాక్ తో చర్చల్లో నిలిచింది.

సాధారణ ప్రేక్షకులే కాదు మెగా అభిమానులు సైతం సినిమా అస్సలు బాగోలేదు అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. అసలు చాలా మంది వ్యక్తం చేస్తున్న అనుమానం ఏమిటంటే అసలు ఈ సినిమా తీసింది సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాలేనా కాదా అని. ఇంకొందరు ఏమంటున్నారు అంటే ఈ సినిమా కథ అసలు కొరటాల అనుకున్నది కాదు నిజానికి దర్శకుడు అనుకున్న లైన్ వేరే స్క్రీన్ పై కనిపించింది వేరే అని. అసలు ఈ సినిమా పూర్తిగా చిరు పైనే ఫోకస్ చేసి కథను సిద్ధం చేశారట కొరటాల. అయితే ఒక 10 నిముషాల గెస్ట్ రోల్ ని మాత్రం చెర్రీ కోసం రాశారట అయితే తన భర్త అలాగే తనయుడు ఈ చిత్రంకి ఎక్కువ నిడివి కలిగిన పాత్రల్లో కనిపించాలి అన్నది కొణిదెల సురేఖ గారు ఆకాంక్ష అట.

దాంతో మెగా హీరోలు జోక్యం చేసుకుని మరీ చరణ్ పాత్రను పెంచమనడంతో కొరటాల 10 నిముషాల పాత్రను 45 నిముషాల పాత్రకు పొడిగించడం దాంతో చిరు కి జోడీగా అప్పటికే సెలెక్ట్ చేసిన కాజల్ పాత్రను తొలగించడం, కథలో అందుకు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేయడంతో అసలు కథ కాస్త అటకెక్కి అతుకులు కథగా మారిందని అంటున్నారు. అలా కొరటాల పాపం మెగా హీరోల జోక్యంతో ఇరుకున పడి ఓటమిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారని ప్రచారం సాగుతోంది. లేకపోతే జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మిర్చి వంటి కొరటాల చిత్రాలు ఎక్కడ ఆచార్య సినిమా ఎక్కడ అంటున్నారు. అదీకాక ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ లు అసలు డైరెక్షన్ జోలికి పోరు డైరెక్ట్ ఏమి చెబితే అదే చేస్తారు ఆ ఫ్రీడమ్ ఆచార్య చిత్రంలో కొరటాలకు లేకపోవడం తోనే తొలిసారి ఓటమిపాలయ్యారు అన్నది ప్రెజెంట్ టాక్. మరి ఈ ఓటమై నుంచి తేరుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: