ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది రాజాసాబ్' సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ, మేకర్స్ తాజాగా విడుదల చేసిన తొలి ట్రైలర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వెల్లువలా వస్తోంది. ముఖ్యంగా ట్రైలర్లో చూపించిన విజువల్ వండర్ అబ్బురపరిచే స్థాయిలో ఉండటంతో, సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఈ భారీ అంచనాల నేపథ్యంలోనే, మేకర్స్ రూ. 1000 కోట్ల బిజినెస్ టార్గెట్‌తో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ నాణ్యత, విజువల్స్ చూశాక, ఈ మార్కెట్ లక్ష్యం 'ది రాజాసాబ్'కి సాధ్యమేనని సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ రేంజ్‌ను మరింత పెంచేలా ఉండబోతుందని సమాచారం. డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండుగలాంటి సినిమా అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దర్శకుడు మారుతిసినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రభాస్ స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా, కథ, కథనం, విజువల్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు కృషి చేశారని సమాచారం. 'ది రాజాసాబ్'తో మారుతి తన మార్క్‌ను మరో స్థాయిలో నిలబెట్టుకుంటారని అంచనా. ఏదేమైనా, తొలి ట్రైలర్‌తోనే సినిమాకు వచ్చిన బజ్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద 'ది రాజాసాబ్' సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

పీపుల్స్ మీడియా బ్యానర్ నిర్మాతలు ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ది  రాజాసాబ్  బాక్సాఫీస్ వద్ద   కొత్త రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.  ప్రభాస్ గత సినిమాలు  బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయగా ఆ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.  సినిమా సినిమాకు ప్రభాస్ ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: