సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. బ్రహ్మోత్సవం , స్పైడర్ మూవీ లతో వరస అపజాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత నుండి మహేష్ బాబు వరసగా మహర్షి ,  సరిలేరు నీకెవ్వరు ,  తాజాగా సర్కారు వారి పాట మూవీ లతో వరుసగా అద్భుతమైన విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటూ తన వరుస జోరును అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ  షూటింగ్ ని ఆగస్టు నెల నుండి ప్రారంభించ బోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాక పోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కాలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ సినిమాగా తిరక్కెక్కనుండి. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించనున్నాడు. ఈ మూవీ ని 28 ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: