నగ్మా అంటే 20 ఏళ్ల క్రితం సౌత్ టు నార్త్ పిచ్చ క్రేజ్ ఉండేది. నగ్మా చిన్నప్పుడే తల్లి తండ్రులు విడాకులు తీసుకోవడంతో చాలా ఇబ్బంది పడింది. టీనేజ్‌లోనే ఆమె బలవంతంగా సినిమాల్లోకి వచ్చేసింది.
ఇంకా చెప్పాలంటే టీనేజ్‌లో నగ్మా హీరోల ముందు చాలా చిన్నగా కనపడడంతో ఆమెకు బలవంతంగా స్టెరాయిడ్లు కూడా ఇచ్చి ఆమె శరీరాకృతిలో మార్పులు వచ్చేలా చేసేవారని.. ఆమె అలా కెరీర్ స్టార్టింగ్‌లో ఎంతో నరకయాతన పడిందన్న పుకార్లు కూడా ఆమె కెరీర్‌పై ఉన్నాయి.

బాలీవుడ్‌లో చిన్న ఛాన్సులు వేసుకుంటోన్న ఆమె దివంగత నటి దివ్యభారతికి స్నేహితురాలు కావడంతో దివ్య సూచనలు, సలహాల మేరకే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తక్కువ టైంలోనే మంచి హిట్లు పడ్డాయి. ఆ తర్వాత కోలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఓ ఊపు ఊపేసింది. అయితే నగ్మా కెరీర్‌లో చాలా మందితో ఎఫైర్లు పెట్టుకుందన్న వార్తలతో బాగా పాపులర్ అయ్యింది.

ఆమె తమిళ్ సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడ శరత్‌కుమార్‌ను పిచ్చపిచ్చగా ప్రేమించింది. ఒకానొక దశలో శరత్‌కుమార్‌ను ఆమె పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. అయితే అప్పటికే పెళ్లయిన శరత్ కుమార్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో నగ్మా శరత్‌కుమార్‌కు దూరమైంది. ఆ తర్వాత భోజ్‌పురి నటులు రవికిషన్ సింగ్‌, మనోజ్ తివారితో, మాజీ క్రికెట్ కెప్టెన్ సారవ్ గంగూలీతోనూ ఆమె ప్రేమాయణాలు నడిపింది.

ఇక నగ్మాతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. తమ సినిమాలో నగ్మా ఖచ్చితంగా ఉండాలని పట్టుబట్టి మరీ ఆమెనే హీరోయిన్గా తీసుకున్న హీరోలు కూడా ఉన్నారు. నాగార్జున నటించిన కిల్లర్ సినిమాలో ఆమె హీరోయిన్‌. ఈ సినిమా టైంలో నగ్మా బిజీగా ఉంది. కిల్లర్ సినిమాకు డేట్లు ఇచ్చేంత టైం ఆమెకు లేదు.

అప్పట్లో నగ్మాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆమెతో ఎలాగైనా ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయాలని డిసైడ్ అయిన నాగార్జున ఆమె కోసం దర్శక నిర్మాతల ద్వారా మేనేజర్లపై ప్రెజర్ చేసి మరీ ఆమెనే చివరకు హీరోయిన్‌గా బుక్ చేయించడంలో సక్సెస్ అయ్యాడట. అప్పట్లో నాగార్జున అమ్మాయిలు, హీరోయిన్ల కలల రాకుమారుడు. హీరోయిన్లతో రొమాన్స్ చేసేందుకు మనోడి ఆరాటం మామూలుగా ఉండేదే కాదు. మనోడి కన్ను నగ్మా మీద పడగా.. చివరకు అనుకున్నది సాధించి ఆమెతో రొమాన్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: