అసలు ఏమాత్రం ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తిరుగులేని స్టార్గా ఎదిగాడు కింగ్ ఖాన్ షారుక్  ఖాన్. హిందీ అగ్ర హీరోగా బాద్షాగా తిరుగులేని స్టార్ అయిన తర్వాత చిత్ర నిర్మాతగానూ.. వ్యాపారవేత్తగానూ.. మారి ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు.ఐపీఎల్ నైట్ రైడర్స్ ఓనర్గా కూడా ఉన్న షారుక్.. అవకాశం ఉన్న ప్రతీ రంగంలోనూ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు.మరి, ఇన్ని ఆదాయ మార్గాలున్న షారుక్ ఆస్తుల విలువ ఎంత? మీకు తెలుసా?? రండి.. బాలీవుడ్ బాద్షా అస్తులు లెక్కేద్దాం.బాలీవుడ్ కేంద్రమైన ముంబైలోనే షారుక్ ఎక్కువగా ఉంటారు. ఈ నగరంలో అత్యంత ఖరీదైన బాంద్రా ఏరియాలో లగ్జరీ ఇల్లు ఉంది. దీనిపేరు "మన్నత్". ఈ ఇంటిని షారూక్ కొన్నేళ్ల క్రితమే రూ.13 కోట్లకు కొన్నాడు.అయితే.. షారుక్ ఖాన్ స్వస్థలం.. ఆయన భార్య గౌరీ ఖాన్ స్వస్థం కూడా దిల్లీనే. దిల్లీలో కొన్నేళ్ల కిందట ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. షారుక్ ఫ్యామిలీ దిల్లీకి వెళ్లినపుడు అందులోనే నివాసం ఉంటుంది.షారుక్ ఖాన్‌ ఎన్నో గౌరవాలు అందుకున్నారు. అందులో ఒకటి దుబాయ్ బ్రాండ్ అంబాసిడర్. ఈ గౌరవం పొందిన షారుక్కు దుబాయ్ గోల్డెన్ వీసా కూడా ఉంది.దుబాయ్కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఉండి.. అక్కడ నివాసం లేకుంటే ఏం బాగుంటుంది చెప్పండి..? అందుకే.. అక్కడి కాస్ట్లీ ఏరియా పామ్ జుమెరయ్‌లో ఒక లగ్జరీ విల్లా కొనిపారేశారు.


దానికి షారుక్ "జన్నత్" అని పేరు పెట్టాడు.ఇక, ముంబైకి సమీపంలోని అలీ బాగ్‌లో కూడా షారుక్‌కు మరో విల్లా ఉంది. ఈ అధునాతన విల్లాలోనే.. షారుక్ ప్రతి ఏటా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడు.20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాను.. తన వైఫ్ గౌరీ అభిరుచికి అనుగుణంగా నిర్మించాడు షారుక్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్తో పాటు హెలీపాడ్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.లండన్లోనూ షారుఖ్కు కళ్లు చెదిరే బంగ్లా ఉంది. పార్క్ లేన్లో ఉండే దీని ఖరీదు తెలిస్తే.. కళ్లు తేలేస్తారు. ఆ భవనాన్ని.. దాదాపు 183 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. లండన్ వెళ్లినప్పుడు ఖాన్ ఇక్కడే ఉంటారు.ఎలాంటి అండా లేకుండా.. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఒక టీవీ ఆర్టిస్టు.. బాలీవుడ్ను ఏలేసి.. అనితర సాధ్యమైన ఆస్తులు కూడబెట్టడం అసామాన్యమైన విషయం. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్  స్టార్  డైరెక్టర్  సిద్ధార్థ్  ఆనంద్ దర్శకత్వంలో పఠాన్  సినిమా చేస్తున్నాడు.మరోసారి కింగ్ ఖాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.. హ్యాపీ బర్త్  డే  షారుక్  ఖాన్..

మరింత సమాచారం తెలుసుకోండి: