
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగిన వెంకటేష్ నేటితరం ప్రేక్షకులను మెప్పించే విషయంలో కొంతవరకు విజయం సాధించలేకపోతున్నాడు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. దీనితో వెంకీ తన కెరియర్ కు సంబంధించి 75వ సినిమా కథను ఎంచుకునే విషయంలో ఒక స్థిరనిర్ణయం తీసుకున్నాడు.
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పిన కథ వెంకీకి నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈనెల 25వ తారీకున రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించబోతున్నారు.
‘హిట్’ మరియు ‘హిట్ 2’ సినిమాలతో దర్శకుడిగా శైలేష్ కొలను మంచి పేరును దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇతడు నానితో ‘హిట్ 3’ ని కూడ తీయవలసి ఉంది. ఆ మూవీకి సంబంధించిన కథకు ఆలోచనలు చేస్తుండగానే ఇతడికి వెంకటేష్ నుండి పిలుపు రావడంతో వెంకీ తో మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
సాధారణంగా వెంకటేష్ తో సినిమా తీయాలి అంటే కథ విషయంలో అతడిని ఒప్పించడం కష్టం అని అంటారు. దీనికితోడు వెంకీ 75వ సినిమా అంటే ఏ స్థాయిలో ఒత్తిడి శైలేష్ కొలను పై ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వెంకటేష్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని ప్రతిఒక్కరు ఈమూవీ గురించి ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. భారీ యాక్షన్ మూవీగా ఒక క్రైమ్ కథను ఎంచుకుని ఈమూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది..