పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , నిది అగర్వాల్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని చిత్ర బృందం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తుంది.

సినిమా పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ జాగర్లమూడి కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితమే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని ఒక ఎపిసోడ్ కు గెస్ట్ గా విచ్చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది.

అలాగే ఆహా నిర్వాహక బృందం కొన్ని రోజుల క్రితమే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వీడియోను కూడా విడుదల చేయగా , ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే ... పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎపిసోడ్ ను ఆహా నిర్వాహక బృందం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు , అందులో భాగంగా మొదటి భాగాన్ని ఫిబ్రవరి 3 వ తేదీన ప్రసారం చేసేందుకు ఆహా యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: