తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి రామ్ పోతినేని ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో రామ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది . ఈ మూవీ ని బోయపాటి శ్రీను పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నాడు .

రామ్ మరియు బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న మొట్ట మొదటి ఇండియా మూవీ కావడం తో ఈ సినిమా పై తెలుగు సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది . ఈ మూవీ యొక్క నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే దక్కించుకున్నట్లు ... కాకపోతే ధర మాత్రం సినిమా విడుదలకు ముందు నిర్ణయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో ఊర్వశి రౌటేల ఒక స్పెషల్ సాంగ్ లో నటించబోతుంది.

ఇప్పటికే ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న రామ్ ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోయే పాన్ ఇండియా మూవీ తో ఏ రేంజ్ విజయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి. అఖండ మూవీ తర్వాత బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: