తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి కళ్యాణ్ రామ్ తాజాగా అమిగోస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ యూనిట్ భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ... ట్రైలర్ మరియు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. వీటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో మొట్ట మొదటి సారి త్రిపాత్ర అభినయంలో కనిపించబోతున్నాడు. దీనితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. 

ఈ విషయాన్ని అమిగోస్ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ నెట్టింట అదిరిపోయే రేంజ్ లో వైరల్ గా మారింది. మరి అమిగోస్ మూవీ తో కళ్యాణ్ రామ్ కు ఏ రేంజ్ లభిస్తుందో చూడాలి. కళ్యాణ్ రామ్ నుండి బింబిసారా మూవీ తర్వాత నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: