కరోనా విజృంభించిన తరువాత చాలామంది బయటకు వెళ్లి పని చేయలేకపోతున్నారు. ఇలా పని చేయలేక పోవడం వల్ల వారికి సంపాదన కూడా చాలా తక్కువ అవుతుంది. మగవారైతే ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇక ఆడవారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది మహిళలకు స్వతంత్రంగా జీవించాలి అనే తపన ఉంటుంది. అందుకు తగ్గట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ కరోనా కారణంగా బయటకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరైతే స్వతంత్రంగా, స్వతహాగా జీవించాలని అనుకుంటున్నారో అలాంటి వారి కోసమే మేము మీ ముందుకు కొన్ని ఐదు చిట్కాలను, డబ్బు సంపాదించేందుకు మార్గంగా తీసుకొచ్చాము. ఆ ఐదు మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుస్తుంది..
ఇప్పుడు చెప్పబోయే కొన్ని డబ్బు సంపాదించే మార్గాలు మీలో పట్టుదల, కసిని పెంచుతాయి. అంతే కాదు మీ వ్యాపారాన్ని ఎలా ప్రమోట్ చేయాలో కూడా మేము వివరిస్తాము . వీటిని పాటించి మీరు కూడా లాభాలు సంపాదించవచ్చు..
1. బిజినెస్ ను ఇంట్లో ఉంటూనే ప్రమోట్ చేయండి :
అంటే ఇంట్లో కూర్చుని క్లైంట్స్ సంపాదించడం చాలా కష్టం. కానీ మీ వద్దకే క్లైంట్స్ వచ్చేలాగా చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా మీ టాలెంట్ ను ఇతరుల వద్దకు చేరవేసే సులభమైన మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి కష్టం లేకుండా సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని ఇతరులకు తెలియజెప్పే ఒక మంచి వేదిక. కాబట్టి మీరు వాట్సాప్ లేదా ఫేస్ బుక్ గ్రూప్ క్రియేట్ చేయండి. దీనికి మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ఇందులో మీ చుట్టుపక్కల వారిని, మీ బంధుమిత్రులను యాడ్ చేసి, రెగ్యులర్గా పోస్ట్ పెడుతూ ఉండండి. తద్వారా మీరు ఏదైతే ప్రోడక్ట్ ని సేల్ చేయాలి అనుకుంటున్నారో,అది వారికి త్వరగా రీచ్ అయ్యి, మీకు డబ్బు సంపాదించేందుకు మార్గం సులభం అవుతుంది.
2. ఆన్లైన్ కన్సల్టెన్సీ :
ప్రస్తుత కాలంలో ప్రజలకు ఆన్లైన్ నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది. కరోనా వల్ల చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా, ఆన్లైన్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే చాలా మంది డాక్టర్లు ఆన్లైన్ కన్సల్టెన్సీ ని కూడా నిర్వహిస్తున్నారు.
3. ఫ్రీలాన్స్ రైటింగ్ బిజినెస్ :
ఒకవేళ మీకు రైటింగ్ స్కిల్స్ బాగుంటే, మీరు ఫ్రీలాన్స్ రైటింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఆన్లైన్లో ప్రస్తుత కాలంలో చాలా అవకాశాలు ఉన్నాయి.మీకు తెలుగు, ఇంగ్లీష్ లో మంచి నాలెడ్జ్ ఉంటే మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించుకోవచ్చు.
4. హోం గార్డెనింగ్ :
మీకు మొక్కలను పెంచడం ఇష్టం ఉంటే, ఇంట్లో నుండి నర్సరీని రన్ చేసుకోవచ్చు. తద్వారా యూట్యూబ్ క్రియేట్ చేసి మీరు నర్సరీలో మీ మొక్కలను ఎలా పెంచుతున్నారో కూడా వివరించి, దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇక నర్సరీ ఉంటే మొక్కలు కొనాలనుకునేవారు కూడా మీ దగ్గరకు వచ్చి మొక్కలు కొనడం ప్రారంభిస్తారు..
5. ఆన్లైన్ యోగా ట్రైనింగ్ :
మీరు ఇంట్లో ఉంటూనే యోగా ట్రైనింగ్ ఇవ్వవచ్చు. అయితే దీనికి కొంత డిజిటల్ నాలెడ్జ్ అవసరం పడుతుంది. ఇక మీరు జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా క్లయింట్ను సంపాదించవచ్చు.
కాబట్టి ఈ ఐదు సూత్రాలలో మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని, సులువైన మార్గం లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి