సాధారణంగా ప్రతి ఒక్కరు డబ్బులు ఇన్వెష్ట్ చేసుకోవడం కోసం రకరకాల మార్గాలను వెతుక్కుంటూ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో ముఖ్యంగా ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన ఉండగా, మిగతా వారి కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. త్వరగా డబ్బు రెట్టింపు కావాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. కానీ ఇందులో డబ్బులు పెట్టడం వల్ల సెక్యూరిటీ ఉంటుందనే నమ్మకం కూడా చాలా మందికి లేదు.. కానీ డబ్బులు త్వరగా రెట్టింపవుతాయి అన్న ఆశతోనే మ్యూచువల్ ఫండ్స్ ను ఎన్నుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, మ్యూచువల్ ఫండ్స్..ఇందులో ఏ దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల త్వరగా రెట్టింపవుతాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఒకవేళ మీరు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే వడ్డీ రేటు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. రూల్ నెంబర్ 77 ప్రకారం చూసుకుంటే , పెట్టిన పెట్టుబడికి  ఫిక్స్డ్ డిపాజిట్లపై 13 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై కేవలం 5.5 శాతం మాత్రమే వడ్డీరేటును పరిగణిస్తారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇందులో రెట్టింపు అవడానికి పది సంవత్సరాలు పడుతుంది. పైగా ఇందులో వడ్డీరేటు 7.1 శాతం వరకు లభిస్తుంది.


ఇక సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వలన మనకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు కావాలంటే, తొమ్మిది సంవత్సరాల నాలుగు నెలలు ఎదురు చూడాల్సి ఉంటుంది. పైగా ఈ స్కీం లో మనకు వడ్డీ రేటు 7.6 శాతం మాత్రమే లభిస్తుంది.

ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే , మన డబ్బు త్వరగా రెట్టింపు అవ్వాలని  అనుకున్నపుడు, అతి తక్కువ సమయంలోనే డబ్బు రెట్టింపవుతుంది. రిస్క్ ఉంటుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఒకవేళ సకాలంలో మన డబ్బు రెట్టింపు అవుతుందని అనుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్  కి సంబంధించిన అన్ని నియమాలను దృష్టిలో పెట్టుకుని,ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల త్వరగా మన డబ్బు రెట్టింపవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: