ఈ మధ్య కాలంలో చాలామంది వ్యాపారాలు మొదలుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్లకు తక్కువ పెట్టుబడి తో ప్రతినెలా ఏకంగా 20 వేల రూపాయల ఆదాయం వచ్చే వ్యాపారాన్ని మనం తెలుసుకుందాం.. చికెన్ కోడి గుడ్ల కు ఎప్పటికీ డిమాండ్ అయితే తగ్గదు.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ కోడిగుడ్ల కు అలాగే చికెన్ కు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి మనం ఈ కోళ్ళ వ్యాపారాన్ని చేపట్టవచ్చు.. ఇందుకోసం గుడ్లు పెట్టే 120 కోళ్లను పెరట్లో సునాయాసంగా పెంచుకునే ‘త్రీ టైర్‌ కేజ్‌ సిస్టమ్‌’ గురంచి తెలుసుకుంటే ఈ కోళ్ల వ్యాపారం తో మంచి లాభాన్ని కూడా పొందవచ్చు.. ఈ ఈ సిస్టం ను మీరు మీ ఇంటి వెనుక పెరట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కేజ్‌ని ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం కూడా పొందవచ్చు.


ఈ సరికొత్త త్రీ టైర్ కేజ్ సిస్టం ఏర్పాటుకు మీకు 8 అడుగులు వెడల్పు, 8 అడుగుల పొడవు ఉన్న స్థలం అవసరం అవుతుంది. ముఖ్యంగా గుడ్లు పెట్టే కోళ్లను మీరు  పెంచుకోవడానికి మూడు అంతస్థుల పంజరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీని ఎత్తు 7 అడుగులు, పొడవు 7.5 అడుగులు, వెడల్పు 7 అడుగులు ఉంటుంది. ఒక వైపు 3 కానాలు, రెండో వైపు మరో 3 కానాలను కోళ్ల కోసం ఏర్పాటుచేసింటారు. దీనికి పైన 20 లీటర్ల ఫైబర్‌ ట్యాంకు మీరు ఏర్పాటు చేసుకోవాలి. రోజూ దీన్ని నింపితే చాలు..ఆ నీరు కోళ్లకు అందుబాటులోకి వస్తాయి.


ఇక 18 లేదా 19 వారాల నుంచి ఈ కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. 19 వారాల వయసున్న కోళ్లను కనుక మీరు ఒక 120 కోళ్ళను కొనుగోలు చేసినట్లయితే సుమారుగా ఒక సంవత్సరం పాటు గుడ్లు పెడుతూనే ఉంటాయి. ఈ 120 కోళ్లు సుమారుగా రోజుకు 110 గుడ్లను అయితే పెట్టగలవు.. ఈ గుడ్ల తో మంచి వ్యాపారము లభిస్తుంది కోళ్లు గుడ్లు పెట్టడం నిలిపివేసిన తర్వాత వాటిని అమ్మి అప్పుడు కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఎంత లేదనుకున్నా కనీసం 20 వేల రూపాయల ఆదాయం అయితే ప్రతి నెల పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: