
ఈ పథకం కింద రీటైల్ ట్రేడర్లు.. స్వయం ఉపాధి పొందేవారు.. చిన్న చిన్న దుకాణాలు దారులు.. ఇలా తక్కువ జీతంతో పని చేసే వారు ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు.. ఈ పథకంలో చేరాలి అనుకుంటే నెలకు రూ.55 నుంచి 200 రూపాయల వరకు మీరు కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇకపోతే కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి.. అదేమిటంటే ఈ స్కీమ్లో రిజిస్టర్ చేసుకోవడానికి దుకాణదారుడు లేదా స్వయం ఉపాధి పొందేవారు సంవత్సరానికి రెండు లక్షలకు మించి ఆదాయం పొందకూడదు.
18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చును.. మొత్తంగా 3.25 లక్షల కామెంట్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.. ఇక ఈ స్కీమ్ లో రిజిస్టర్ అయిన లబ్ధిదారుడు ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే.. నామిని కి పెన్షన్ లో 50% పెన్షన్ అందివ్వడం జరుగుతుంది.. ముఖ్యంగా ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్, జన్ ధన్ అకౌంట్ నెంబర్ ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.