చాలామంది ఉద్యోగస్తులు సైతం పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కాకుండా ఉండాలని చాలా కష్టపడుతూ సంపాదించిన వాటిలో కొంత మొత్తాన్ని సైతం పొదుపు చేసుకుంటూ ఉంటారు.. అయితే మీ లక్ష్యాన్ని చేదించాలంటే కచ్చితంగా పొదుపులలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. మీరు కూడా భారీ నిధులను కూడా పెట్టాలనుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు.. భారీ వడ్డీతో పాటు మీ డిపాజిట్ల పైన ప్రభుత్వం కూడా హామీగా ఉంటుంది. దీనికి తోడు మీరు ఆదాయపన్ను సెక్షన్ 80C కింద బిఎఫ్ లో పెట్టుబడి పైన పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.


రూ.500 ppf లో పెట్టుబడులు ప్రారంభిస్తే ఒక సంవత్సరంలోనే గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. మెచ్యూరిటీ వ్యవస్థ 15 సంవత్సరాలు అంటే.. ఆ తర్వాత మీ పిఎఫ్ ఖాతాను 5 సంవత్సరాలు పొడిగించుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. ప్రతినెల కేవలం రూ .5000 రూపాయలు ఆదా చేయడం వల్ల రూ .42 లక్షల రూపాయలను కూడా పెట్టుకోవచ్చు.. ఈ పథకంలో 7.1 % వడ్డీని సైతం జమ చేసి ఇస్తారట..


ప్రతినెల 5000 రూపాయలను జమ చేస్తే ఏడాదికి 60 వేల రూపాయలు ppf ఖాతాల జమ చేస్తారు. దాదాపుగా 15 సంవత్సరాలలో జమ చేసిన మొత్తం.. రూ.9,00,000 అవుతుంది.. దీంతో అప్పటికే వడ్డీ రేటు చూస్తే..7,27,284 కాగా మొత్తం మీద మీ డిపాజిట్ ఫండ్..16,27,284 అవుతుంది దీన్ని ఒకవేళ 5+5 సంవత్సరాలు మళ్లీ పొడిగించుకుంటే అంటే పదేళ్లపాటు పొడిగిస్తే రూ .42 లక్షల రూపాయల వరకు ఉంటుంది. 25 సంవత్సర కాలంలో మీరు వడ్డీ కచ్చితంగా  రూ.26 లక్షల కంటే ఎక్కువగానే పొందవచ్చు. మీ దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ లో ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులలో ppf ఖాతాను సైతం తీయవచ్చు దీనికోసం ఇండియన్ పౌరుడై ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: