వరుస హిట్ల తో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేశాడు.. ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సైతం సక్సెస్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ కావడంతో యూత్ ఈ సినిమా కి బాగ్ కనెక్ట్ అయ్యింది.. వరుసగా అన్ని ఫ్లాప్ లు అనేసరికి తేజ్ చాలా కృంగిపోయాడని అప్పట్లో మెగా కాంపౌండ్ వాపోయింది.