గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినిమాలలో వాన పాటలు లేవు. 2002లో ఆర్తి అగర్వాల్ తో ఒక వాన పాటను తన తాత నందమూరి తారక రామారావును అనుసరిస్తూ వాన పాట చేసిన జూనియర్ మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఆ ట్రెండ్ ను నేటి యూత్ కు పరిచయం చేయబోతున్నాడు. జూనియర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఒక రొమాంటిక్ రెయిన్ సాంగ్ ఉండబోతోంది.
అయితే అందరికీ షాక్ ఇస్తూ సమంత ఈ సాంగ్ లో జూనియర్ తో రెచ్చిపోయి విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేసే సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. మొదట్లో ఈ పాటను చేయడానికి అభ్యంతరం చెప్పిన సమంత ఈమధ్య తన ఫారెన్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తరువాత మనసు మార్చుకుని లైన్ క్లియర్ చేయడంతో ఈ పాట చిత్రీకరణ ప్రస్తుతం కేరళాలో జరుగుతోంది.
సమంత పెళ్ళి వార్తలు హడావిడి చేయడం మొదలు పెట్టాక సమంత ఈ పాటను చేయను అన్న తరువాత మాస్ ప్రేక్షకుల కోసం కాజల్ తో ఈసినిమాలో ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు అన్న ప్రచారం జరిగింది. అయితే సమంత మనసు ఎందుకు మారిందో తెలియక పోయినా ఇప్పుడు ఆమె ‘జనతా గ్యారేజ్’ కోసం చేస్తున్న ఈ రెయిన్ సాంగ్ ఈసినిమాకు హైలెట్ గా మారుతుంది అని అంటున్నారు. కేరళాలో జరుగుతున్న ఈసినిమా షూటింగ్ స్పాట్ నుండి ఈ ఫోటో లీక్ అయింది అని అంటున్నారు.
నిజమైన వానలో సమంత అలా చిట్టిపొట్టి బట్టలతో వానలో తడసి ముద్దవుతూ జూనియర్ తో రొమాన్స్ చేస్తూ ఉంటే ఈసినిమా యూనిట్ వారు అంతా చాల ఆశ్చర్యంగా చూసారని టాక్. సమంత జూనియర్ లతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడ వానలో తడుస్తూ వీరిద్దరికీ రొమాంటిక్ సూచనలు ఇవ్వడంతో సమంతా జూనియర్లు ఈ పాట కోసం రెచ్చి పోతున్నట్లు టాక్. సమంత నటిస్తున్న ఈ రెయిన్ సాంగ్ న్యూస్ నాగార్జున వరకు చేరడంతో నాగ్ కూడ షాక్ అయ్యాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి