స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిని ఇప్పడు ఫిలిం ఇండస్ట్రీలో మెగా డైరెక్టర్ అంటూ పిలుస్తున్నారు. దీనికి కారణం గత సంవత్సరం రామ్ చరణ్ తో ‘ధృవ’ సినిమాను చేసిన సురేంద్రరెడ్డి వెనువెంటనే మరో హీరోతో సినిమా చేయకుండా చిరంజీవితో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రాజెక్ట్ కు కార్నర్ అయిపోయాడు.
ఈమూవీ కోసం కన్నడ సినిమా రంగం నుండి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకును హీరోగా చేసే రెండవ సినిమా అవకాశం వదులుకున్నాడు. ఈసినిమాకు సురేంద్ర రెడ్డికి 10 కోట్ల ఆఫర్ వచ్చిందని కూడ వార్తలు వచ్చాయి.
అయితే ‘ఉయ్యాలవాడ’ ప్రాజెక్ట్ ఏప్రియల్ నుండి ప్రారంభం అవుతుంది. అని సురేంద్ర రెడ్డి భావించినా ఈ మూవీ స్క్రిప్ట్ పై చిరంజీవికి అనేక అనుమానాలు ఇంకా వెంటాడుతున్న నేపధ్యంలో ఈ మూవీ షూటింగ్ జూన్ లో మొదలైతే చాల గొప్ప విషయమే అని అంటున్నారు.
దీనితో సురేంద్ర రెడ్డి ఉయ్యాలవాడ స్క్రిప్ట్ గురించి అనేక చర్చలు చేస్తూ అనుక్షణం బిజీగా ఉంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయిన దగ్గర నుండి సురేంద్ర రెడ్డి చరణ్ ల మధ్య విపరీతమైన సాన్నిహిత్యం పెరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
వీరి సాన్నిహిత్యం ఏస్థాయికి చేరింది అంటే సురేంద్ర రెడ్డి తన పిల్లలను రామ్ చరణ్ ఇంటికి తీసుకు వచ్చేంత స్థాయికి పెరిగిపోయింది అని ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా సురేంద్ర రెడ్డి పిల్లలు ఇద్దరికీ తన స్టైల్ లో చరణ్ స్పెషల్ గిఫ్ట్ లు ఇచ్చాడు. నిజమైన ఒకచిన్న గుర్రాన్ని సురేంద్ర రెడ్డి పిల్లలకు బహుమతిగా ఇచ్చి జంతువుల పై తనకున్న ప్రేమను మరింత చాటుకున్నాడు రామ్ చరణ్..