సినిమా ఇండస్ట్రీలోకి ఐదేళ్ల వయసులో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన లెజండరీ నటి శ్రీదేవి.. సినిమాల్లో రాణిస్తుందని బహుశా ఆమె తల్లిదండ్రులు కూడా కలలో ఊహించి ఉండరేమో?. అలా బాలనటి నుంచి అతిలోక సుందరి వరకూ తన అందచెందాలతో నటించి మెప్పించి ఇండియా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మూడు తరాల హీరోలతో నటించి మెప్పించారు నటి శ్రీదేవి. నేటి నవతరం హీరోయిన్లు ఇప్పటికీ శ్రీదేవి స్టైల్ నే అనుసరిస్తారనడంలో అతిశయోక్తి లేదు.
అప్పట్లో చాలా మంది హీరోలు తమ ఫెవరేట్ హీరోయిన్ ఎవరని అడిగితే..వెంటనే అతిలోక సుందరి శ్రీదేవి అని చెప్పేవారు. అంత గొప్ప హీరోయిన్..ఇప్పుడు మన మద్య లేదు... తన భర్త బోనీకపూర్ బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఆదివారం తెల్లవారు జామున (ఫిబ్రవరి-24న) గుండెపోటుతో మరణించారు.శ్రీదేవి హఠాన్మరణం అందర్నీ విషాదంలో ముంచెత్తింది. ఇక శ్రీదేవి తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
శ్రీదేవి బాలీవుడ్ లో కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది..అయితే ఆమెపై వచ్చిన వదంతులు మరోసారి వెలుగుచూశాయి. 1980లో హీరో మిథున్ చక్రవర్తితో ప్రేమాయణంపై పెద్దఎత్తున వదంతులు వచ్చాయి. శ్రీదేవి-మిథున్ మధ్య ‘రహస్యంగా పెళ్లి’ జరిగిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లపై మిధున్ చక్రవర్తి, శ్రీదేవిలు ఖండించారు..తాము కేవలం నటన పరంగా ఫ్రెండ్లీగా ఉంటామని..ఎలాంటి అఫైర్స్ లేవని క్లారిటీ ఇచ్చారు.
1996లో బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. బోనీని పెళ్లిచేసుకున్న 7 నెలల తర్వాత 1997 జనవరిలో శ్రీదేవీ ప్రకటించారు. బోనీకపూర్‌కు అప్పటికే పెళ్లి అయింది. మొదటి భార్య పిల్లలు అన్షులా, అర్జున్ కపూర్ సొంత సంతానంలా శ్రీదేవి చూసుకున్నారు.