బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ఫై , ప్రియమణి ,గుల్ పనాగ్ , కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్... ' ది ఫ్యామిలీ మ్యాన్'. ఇటీవల ఈసిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాగా ఆ ఎపిసోడ్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే , అలాగే అద్భుతమైన స్టోరీ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. హిందీలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ , తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రసారం అవుతుంది. ఐఎండిబి లో కూడా ఈ వెబ్ సిరీస్ 8.9 రేటింగ్స్ ను రాబట్టుకుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్లు రాజ్ మరియు డీకే దీనికిసీక్వెల్ ను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సీక్వెల్ లో ఓ కీలక పాత్ర కోసం సమంత ను సంప్రదించగా అందుకు ఆమె ఓకే చెప్పిందట. ఇక ఈ సీజన్ 2 లో సమంత నెగిటివ్ పాత్రలో నటించనుందని సమాచారం. ఇప్పటివరకు ఆమె ఏ సినిమాలో కూడా ఇలాంటి పాత్రలో నటించలేదు. ఫస్ట్ టైం ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంత నెగిటివ్ పాత్రలో నటిస్తుంది. మరి ఈ పాత్రలో సమంత ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.