నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ భానుశ్రీ బిగ్ బాస్ షో తరువాత అడపాదడపా సినిమాల్లో నటిస్తూ పలు సీరియళ్లలో కూడా నటిస్తున్నారు. నటి కావాలనే కోరికతో తల్లిదండ్రులతో ఫైట్ చేసి మరీ సినిమా ఇండస్ట్రీకి వచ్చానని భానుశ్రీ చెప్పారు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఏడు చేపల కథ సినిమాలో భానుశ్రీ కూడా ఒక హీరోయిన్ గా కనిపించారు. ఆ సినిమాకు పెద్దగా హిట్ టాక్ రాకపోయినా కలెక్షన్ల పరంగా పరవాలేదనిపించుకుంది. 
 
క్యాస్టింగ్ కౌచ్ గురించి భానుశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది బలవంతంగా ఏమీ జరగదని... వీళ్లు సహకరిస్తే మాత్రమే వాళ్లు ఏమైనా చేయగలరని, లేకపోతే వాళ్లేమీ చేయలేరని భానుశ్రీ అభిప్రాయం వ్యక్తం చేశారు. అవకాశాల కోసం వెళ్లే వారికి రెండు దారులు కనిపిస్తాయని అందులో మంచిదారి ఏదో చెడుదారి ఏదో ఎంచుకోవాల్సిన భాద్యత మనపైనే ఉంటుందని భానుశ్రీ చెప్పారు. 
 
చప్పట్లు రెండు చేతులు కలిపితేనే వస్తాయని అదే విధంగా అలాంటివి ఇద్దరి మనుషుల మధ్య అంగీకారం ఉంటే మాత్రమే జరుగుతాయని భానుశ్రీ అన్నారు. బిగ్ బాస్ సీజన్3 పై వచ్చిన కమిట్మెంట్ ఆరోపణల గురించి స్పందిస్తూ తాను కూడా ఈ వార్తలు విన్నానని కానీ బిగ్ బాస్ సీజన్1, సీజన్2 లో కమిట్మెంట్ లాంటిది ఏమీలేదని అన్నారు. బిగ్ బాస్ షోలో తమను బాగా రిసీవ్ చేసుకున్నారని భానుశ్రీ చెప్పారు. 
 
ఢీ షో నుండి యాంకర్ గా తప్పుకోవటం గురించి స్పందిస్తూ బిగ్ బాస్ షోవాళ్లు షో ముగిసిన ఆరు నెలల వరకు బయట ఎక్కడా పని చేయకూడదని షరతు పెట్టడం వలనే ఈటీవీ వాళ్లు తనను తీసేశారని చెప్పారు. ఢీ షో నుండి తనను తొలగించడానికి మాటీవీ చేసిన ఘనకార్యమే కారణమని చెప్పారు. ఏడు చేపల కథ సినిమా గురించి స్పందిస్తూ టీజర్ విడుదలైన తరువాత అడల్ట్ కంటెంట్ జోడించారని తనకు చెప్పిన కథ ఒకటి అని సినిమాలో చూపించింది ఒకటి అని అభిప్రాయపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: