టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి మూవీస్ తో ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరారు.  ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపారు.  ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ డూపర్ హిట్ అయ్యంది.  ఈ మూవీ లో మహేష్ బాబు కామెడీ, ఎమెషన్స్, ఫైట్స్ దుమ్మురేపాయి.  ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏంటంటే పదమూడేళ్ల తర్వాత లేడి అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చారు.

 

ఈ ఏడాది సంక్రాంతికి రెండు భారీ సినిమాలు పోటీప‌డ్డాయి, ఒక‌టి స‌రిలేరు నీకెవ్వ‌రు, మ‌రొక‌టి అల వైకుంఠ‌పుమ‌రులో. 22 రోజులు దాటినా వీటి క‌లెక్ష‌న్స్‌లో ఎలాంటి మార్పు లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తూ స‌రికొత్త రికార్డులు సాధిస్తున్నాయి. అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్భార్ రిలీజ్ అయినా.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది.  దాంతో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ పురం దుమ్మురేపాయి.

 

కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి.  తొలి వారంలో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల సాధించిన ఈ మూవీ రెండ‌వ వారం పూర్త‌య్యే స‌రికి టాప్ 4లో నిలిచి రెండు తెలుగు రాష్ట్రాల్లో 106.6 కోట్ల షేర్‌ని సాధించి ఆల్‌టైమ్ రికార్డు సాధించిన సినిమాల్లో 4వ స్థానంలో నిలిచింది. 22 రోజుల్లో 115 కోట్ల షేర్‌ని సాధించిన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 140 కోట్ల షేర్‌ని వ‌సూలు చేయ‌డం విశేషం. 

 

నైజాం – 38.8 కోట్లు


సీడెడ్ – 16.07 కోట్లు


గుంటూరు – 9.7 కోట్లు


ఉత్త‌రాంధ్ర – 19.73 కోట్లు


తూర్పు గోదావ‌రి – 11.05 కోట్లు


ప‌శ్చిమ గోదావ‌రి – 7.3 కోట్లు

కృష్ణా – 8.7 కోట్లు


నెల్లూరు – 4.05 కోట్లు

22 రోజుల మొత్తం షేర్ – 115.4 కోట్లు

 

క‌ర్ణాట‌క + రెస్ట్ ఆఫ్ ఇండియా – 11.9 కోట్లు


ఓవ‌ర్సీస్ – 12.70 కోట్లు

...............................................................................................

వ‌ర‌ల్డ్ వైడ్ 22 డేస్ షేర్ – 140 కోట్లు

.................................................................................................

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: