టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వంతో 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఫస్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పవన్, అక్కడి నుండి తనకు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, మెల్లగా ఒక్కొక్కమెట్టు ఎదుగుతూ తన టాలెంట్ తో పవర్ స్టార్ గా ఎందరో అభిమానులను సంపాదించారు. ఇక తొలి సినిమా రిలీజ్ తరువాత విశాఖపట్నానికి చెందిన నందినిని వివాహం చేసుకున్నారు పవన్. అప్పటికి ఆయన వయసు 26 సంవత్సరాలు కాగా, ఆయన భార్య నందిని వయసు 19 ఏళ్ళు. మెగా ఫ్యామిలీ కుదిర్చిన ఈ వివాహం, వారి కుటుంబ సభ్యులు, పలువురు అతిథుల సమక్షంలో 1997 మే లో ఎంతో వైభవంగా జరిగింది. 

 

అయితే దాదాపుగా నాలుగేళ్లు ఎటువంటి అరమరికలు లేకుండా సాగిన వారి సంసారంలో 2000వ సంవత్సరం తరువాత కొద్దిపాటి కలతలు రేగాయి. అదే ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ నటించిన బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ తో పవన్ సహజీవనం చేస్తుండడంతో 2007లో నందిని, పవన్ పై కోర్ట్ లో కేసు వేసింది. అయితే అప్పటికే పవన్, రేణులకు 2004లోనే అకీరా నందన్ జన్మించడం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి సహా, వారి ఫ్యామిలీలో మొత్తం 14 మందిపై కేసులు వేసిన నందిని, పవన్ నుండి తనకు విడాకులు కావాలని, అది మాత్రమే కాక కుటుంబ పోషణార్ధం నెలకు ఐదు లక్షల రూపాయలు భరణం కోరగా కోర్ట్ ఆమె కేసును కొట్టివేయగా, ఆమె ఉన్నత న్యాయస్థానం చేరి అక్కడ స్టే పొందింది. 

 

అయితే ఈ సమస్యను మరింత పెద్దదిగా చేయడం ఇష్టం లేని మెగా ఫ్యామిలీ, 2008 ఆగష్టు లో పవన్ నుండి నందినికి చట్టబద్ధంగా విడాకులు మంజూరు అయిన అనంతరం ఆమెకు ఐదు కోట్ల రూపాయలు భరణముగా చెల్లించారు. ఇక తరువాత కొన్నాళ్ళు ఒంటరిగా గడిపిన నందిని, 2010లో ఒక డాక్టరుని రెండవ వివాహం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రత్యేకించి పవన్ కు, నందినికి ప్రత్యేకంగా వివాదాలు ఏవి లేవని, కాకపోతే కొన్ని కారణాల రీత్యా అనంతరం పవన్, రేణు దేశాయ్ ని ప్రేమించి వివాహం చేసుకోవడం జరిగిందని తెలుస్తోంది. ఇక ఇటీవల రేణు నుండి విడిపోయి, అన్న లెజెనోవాతో కలిసి జీవిస్తున్న పవన్, అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: