నిన్న మొన్నటి వరకూ ఆమె ఓ సాధారణ హీరోయిన్ ‘నచ్చావులే’ చిత్రం ఆమెకు కాస్త పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత పెద్దగా చిత్రాల్లో అవకాశాలు రాలేదు.  దాంతో కొంత కాలం పాటు సైలెంట్ గా ఉన్న మాధవీలత ఆ మద్య శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఎత్తున గొడవ చేసింది.. ఆ సమయంలో వెలుగులోకి వచ్చింది నటి మాధవీ లత.  ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరిన ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం మొదలు పెట్టింది. ఈ మద్య  సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ట్రోలింగ్ బాధ తప్పట్లేదు. బీజేపీ మహిళా నేత, ప్రముఖ సినీ నటి మాధవీలత స్పందిస్తూ తన ట్రోలింగ్ అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

 

తాజాగా ఇదే విషయాన్ని మాదవిలత ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. మమ్ముల్ని రెండు రోజులకోసారి తనను ట్రోల్ చేస్తూ పోస్ట్స్ వస్తూ వుంటాయని చెప్పారు.  చిత్ర రంగంలో ఉండటం ఒక నేరంగా, రాజకీయాల్లో ఉండటం మరో నేరంగా భావిస్తూ, ఈ రెండింటిని ‘లింక్ అప్’ చేస్తూ ట్రోల్ చేస్తున్నారని అన్నారు.  ప్రతిరోజూ తమ ఇంటిపై స్పై కెమెరాలు పెట్టి చూసినట్టు తన గురించి ఏదేదో సామాజిక మాధ్యమాల్లో తనను ట్రోల్ చేసేవాళ్లు రాసేస్తుంటారని బీజేపీ మహిళా నాయకురాలు, ప్రముఖ నటి మాధవీ లత విమర్శించారు. ఇలాంటి అసభ్య పోస్ట్ లు చేసే వారికి ఘాటుగా బదులిస్తానని, ‘స్టే ఎట్ మై హోం’ అనో లేకపోతే తమ అపార్టుమెంట్ బయట స్పై కెమెరా పెట్టుకుని కూర్చోమనో కామెంట్స్ పెడుతుంటానని చెప్పారు.  

 

ఇలాంటి పోస్ట్ లు వచ్చినప్పుడు తనను తానే నియంత్రించుకునే దానిని అని, కొంత మంది అకౌంట్లను తొలగించడం వంటివి చేయించే దానిని అనీ అన్నారు.  అందుకే ఈసారి ఇలాంటి పిచ్చివాళ్లకు బుద్ది చెప్పాలని సజ్జనార్ కార్యాలయానికి వెళ్లిన మాధవీలత ఫిర్యాదు చేశానని అన్నారు.   ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ తరహా ఫిర్యాదులు చాలా వస్తున్నాయని, చర్యలు చేపడతామని సజ్జనార్ చెప్పారని అన్నారు.
  

మరింత సమాచారం తెలుసుకోండి: