సినిమా ఇండస్ట్రీ క్రికెటర్లకు ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు క్రికెటర్లను ఇష్టపడ్డారు. ఎన్నో లవ్ ట్రాక్ లు కూడా నడిపారు. అయితే ఈ పరస్పర ఆకర్షణ ఈనాటిది కాదు.... బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి నుంచి సినిమా వాళ్లు క్రికెటర్ల మధ్య ఎన్నో లవ్ ట్రాక్ లు నడిచాయి. ఇక ఇప్పటికి... ఈ సాంప్రదాయం నడుస్తూనే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మధ్యకాలంలో తెర మీదికి వచ్చిన సినిమా క్రికెట్ ప్రేమాయణం ఏది అంటే...  సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లవ్ ట్రాక్. వీరిద్దరి మధ్య ఎన్నో రోజుల నుంచి ప్రేమాయణం నడుస్తుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే సౌత్ ఇండస్ట్రీ కి చెందిన అనుపమ పరమేశ్వరన్... నార్త్ కు చెందిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎలా బుట్టలో వేసుకుంది అనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని విధంగా ఉంది. అయితే వీరిద్దరి ప్రేమాయణం పై అందరికి  ఎక్కడ అనుమానం వచ్చింది అంటే. సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ ను జస్ప్రిత్ బూమ్రా ఫాలో అవ్వడమే కాకుండా అనుపమ పరమేశ్వరన్ పెట్టిన ప్రతి పోస్ట్ కు  లైకులు కామెంట్లు పెడుతున్నాడు జస్ప్రిత్ బూమ్రా. మరి బూమ్రా లైకులు కొడితే అనుపమ పరమేశ్వరన్ ఏమైనా తక్కువ తిందా... అనుపమ కూడా బుమ్రా  పోస్టులకు తెగ లైకులు కొట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే నెటిజన్లకు వీరిద్దరి మధ్య ఏదో లవ్ ట్రాక్ నడుస్తుందని అనుమానాలు రేకెత్తాయి. 

 

 

 ఇప్పటికే ఈ యువ జంట డేటింగ్ లో ఉన్నారని... వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్లో ఉండి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని కానీ ఎక్కడా కెమెరాకు చిక్కిన లేదు అంటూ ఒకానొక సమయంలో ముంబై మీడియా కూడా కథనాలు రాసింది. అయితే సోషల్ మీడియాలో వీరిద్దరూ లవ్ ట్రాక్ నడుపుతున్నారని డేటింగ్ లో ఉన్నారని చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని ఎన్నో వార్తలు రావడం తప్ప. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో మాత్రం ఇప్పటివరకు ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఒకవేళ వీరిద్దరు నిజంగానే రిలేషన్షిప్ లో ఉంటే అంత రహస్యంగా ప్రేమించుకోవడం ఎలా అన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ అందంగా ముస్తాబై సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడితే చాలు ఇంత  అందంగా రెడీ అయ్యి  ఎదురుచూస్తుంది జస్ప్రిత్ బూమ్రా కోసమేనా  అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్ట సాగారు. మరి వీరి ప్రేమ విషయం సోషల్ మీడియాకు చిక్కి బయటపడాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: