ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ ని తెరమీదికి తెచ్చి పలువురు సంచలన కామెంట్లు కూడా చేశారు. ఇక మీ టూ  ఉద్యమంతో స్టార్ హీరోయిన్లు సైతం తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటకు చెప్పి సంచలనమే సృష్టించారు. ఇక టాలీవుడ్ లో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పేరుతో చేసిన ఉద్యమం మామూలు దుమారం లేపలేదు. టాలీవుడ్ లోని చాలా మంది పెద్దలకు చెమటలు పట్టించింది శ్రీ రెడ్డి మీటూ ఉద్యమం. ఏకంగా శ్రీ రెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా అన్ని భాషల సినిమా పరిశ్రమలోనే కాదు అన్ని రంగాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అన్నది వాస్తవం. ఈ విషయాన్ని చాలా మంది ప్రముఖులు కూడా తెలిపారు. 

 

 

 

 అయితే ఇండస్ట్రీకి కొత్త అమ్మాయిలు వచ్చి వారికి సినీ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేకుండా సినిమాలో రాణించాలి అనుకునే వారు ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ కి గురయ్యేవారు అని ఇండస్ట్రీ లో ఓ టాక్  ఉంది. అయితే ఇలాంటి ఘటనే ఎదురైందని చెబుతుంది ఓ బాలీవుడ్ నటికి . తాజాగా తనకు ఎదురైన పాత అనుభవాలను వెల్లడించింది. అప్పటికే పలు సినిమాల్లో నటించి ఇక బిగ్బాస్ షోకి వెళ్ళడం ద్వారా మరింత క్రేజ్ సంపాదించిన బాలీవుడ్ నటి రష్మీ  దేశాయ్. నటిగా ఎంతగానో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే మొదట్లో వరుస సినిమాలు చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం అవకాశాలు లేక తెర మీద ఎక్కడా కనిపించలేదు. 

 

 

 

 కానీ ఆ తర్వాత బిగ్ బాస్ లో  ప్రత్యక్షమై బాగా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోందట ఈ అమ్మడు. ఈ  క్రమంలోనే ఒక టాక్ షోలో పాల్గొంది రష్మీ దేశాయ్. ఈ టాక్ షోలో కెరియర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చింది. తాను పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడే హీరోయిన్ అవ్వాలని దృఢసంకల్పంతో ఇండస్ట్రీలోకి వచ్చానని... కానీ తనను ఎంతో మంది మోసం చేసేందుకు ప్రయత్నాలు చేశారు అంటూ చెప్పుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది.. యష్  రాజ్ అనే పేరుతో సూరజ్  అనే వ్యక్తి తనను మోసం చేసేందుకు ప్రయత్నించాడు అంటూ తెలిపింది. సూరజ్  అనే వ్యక్తి అవకాశాలు ఇస్తానంటూ హోటల్ కి పిలిచి... కూల్ డ్రింక్ లో  మత్తుమందు కలిపి తనను రేప్ చేయబోయాడు అంటూ సంచలన నిజాలను బయటపెట్టింది . కానీ ఎలాగోలా తన నుంచి తప్పించుకున్న అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: