అప్పటి ఎన్నో సినిమాలలో వీరి ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతం. సినిమాలో వీరు ఇద్దరు భార్య భర్తల పాత్ర పోషిస్తే ఇంక కామిడీకి కొదవ లేదు. బ్రహ్మానందం ఎన్నో సినిమాలలో నటించారు. హాస్యం పండించడంలో ఆయన ముందుంటాడు. అయితే వీరి కాంబినేషన్ మాత్రం కేక పెట్టిస్తుంది. 

 

 

కోవై సరళ మంచి ట్యాలంటెడ్ నటి. ఈమె ఎన్నో చిత్రాలలో నటించింది. మంచిగా నవ్విస్తూ భార్య పాత్రలు చేసింది. అయితే కొవై సరళ బ్రహ్మానందంతో జతకడితే ఇంక ఆ జోడి సంగతే వేరు. ఇంక ఫుల్గా నవ్వుకోక తప్పదు. వీరు ఇద్దరూ భార్య భర్తల క్యారక్టర్స్ లో చేసి ఎంతగానో మెప్పించారు. అయితే ఆ జోడి జతకట్టిందంటే ఇంక నవ్వు ఆపుకోలేరంతే. అయితే ఎన్నో సినిమాల్లో వీరి జోడి హిట్ అయ్యింది. బ్రహ్మానందం డైలాగ్స్కి కోవై సరళ రివర్స్ పంచ్ కి సరిపోతుంది. నిజంగా చూస్తే ఇంక సరదాగా నవ్వుకోవడమే.

 

 

సందడే సందడి, రెబల్, పెళ్ళి, నాయకి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, శ్రీరామ చంద్రులు, ఎలా చెప్పను, మా అల్లుడు వెరీ గుడ్, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు, తిరుమల తిరుపతి వెంకటేషం ఇలా ఎన్నో సినిమాలలో వీరు ఇద్దరు జంటగా నటించారు. అయితే వీరి కాంబినేషన్ గురించి నిజంగా చెప్పుకునే తీరాలి. ఎంతో గొప్పగా, ఎంతో మంచిగా వీరి నటన అందర్నీ ఇట్టే ఆకట్టుకుని ఎంతగానో నవ్విస్తుంది. నిజంగా వీరి సీన్స్ అద్భుతం. టీవి ముందు కూర్చుంటే కట్టిపడేస్తుంది వీరి కాంబినేషన్.

 

 

నవ్వుకోక తప్పదు ఎవరైన. అంత మంచి జంట బ్రహ్మానందం, కోవై సరళది. ఎంతో బాగా ఆకట్టుకుంటుంది వీరి నటన. ఇందుకే వీరిద్దరి జంట కాస్త ప్రత్యేకం. ఇలా వీరు సూపర్ కపుల్స్గా అనేక సినిమాలు చేసారు. వీరి జంటపై స్పెషల్ చూపు పడేలా మార్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: