తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమాల్లో టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే... రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీని స్థాపించారు. ఇక జనసేన పార్టీని స్థాపించినప్పటినుంచి రాజకీయాల్లో తనదైన స్టైల్లో దూసుకుపోయారు. ఎన్నో ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ దూకుడు చూసి పవన్ కళ్యాణ్ ప్రసంగాలను చూసి ఎంతో మంది జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలోకి వలసలు కూడా వచ్చారు.. 

 

 

 ఒక ప్రత్యేక ఎజెండాతో జనసేన పార్టీని స్థాపించి అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నాను  అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే మొదట ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకుండా టిడిపికి మద్దతు తెలిపింది. ఒకరకంగా టిడిపి అధికారంలోకి రావడానికి జనసేన కూడా కారణం అనే చెప్పాలి. ఇక 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ మెజారిటీ స్థానాలు సంపాదించుకుని  ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఏకంగా రెండు స్థానాల్లో  పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఓటమిపాలు అవ్వాల్సిన  పరిస్థితి ఏర్పడింది. జనసేన పార్టీ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకోని  ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 

 

 

 అయితే జనసేన పార్టీ ఘోర ఓటమి పాలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే జనసేన ఘోర ఓటమి పాలవడం వెనుక కారణం ఏమిటి అనే దానిపై అందరిలో ప్రశ్న తలెత్తింది. కాగా  జనసేన కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన ఓటమికి కారణం ఏంటో చెప్పేశారు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక్క రూపాయి డబ్బు.. ఒక్క సీసా లిక్కర్  కూడా పెంచలేదని... నిజాయితీగా గెలవాలని ఆయన పోటీ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తాము అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మేర  ఖర్చు పెట్టుకోగలము  అని చెబితే.. డబ్బు మందు పంచి  వోటర్లను ప్రలోభాలకు గురి చేసే లాగా అయితే జనసేన పార్టీ నుండి పక్కకు తప్పుకొని పోటీ చేయాలి అంటూ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్  తెలిపారట. ఇలా నిజాయితీగా పోటీ చేయడం వల్లే పవన్ కళ్యాణ్ ఓడిపోయారు అంటూ నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: