పవన్ కళ్యాణ్ కసరత్తులు మొదలుపెట్టాడు. భారీ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు వెయిట్ తగ్గుతున్నాడు. గంటల కొద్దీ కసరత్తులు చేస్తూ.. పాత పవర్ స్టార్ ను చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. తమ్ముడు లుక్ ని రీక్రియేట్ చేసేందుకు చాలా కష్టపడుతున్నాడు పవన్. మరి పవన్ ఇంత సడన్ గా కండలు ఎందుకు పెంచుతున్నాడు అనుకుంటున్నారో తెలుసా..
పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో, క్రిష్ మూవీకి అంతే కష్టపడుతున్నాడు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ త్పపితే అంతకంటే ఎక్కువే కష్టపడుతున్నాడు పవన్. వెయిట్ తగ్గడానికి గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తున్నాడు. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ, జిమ్ లో చెమటలు కక్కిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్లాక డైటింగ్ లు, వర్కవుట్లు తగ్గించాడు. సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టే.. ఈ కసరత్తులకు కూడా కామా పెట్టేశాడు. వకీల్ సాబ్ లో పవన్ ఫిట్ గా కనిపించాల్సిన పనిలేదు కాబట్టి.. పొలిటికల్ లుక్ తోనే వెళ్లిపోయాడు. అయితే క్రిష్ మూవీ పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. బ్రిటీష్ పాలన కాలం నాటి కథ కాబట్టి.. గుర్రపు స్వారీలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఫిట్ నెస్ పై ఫోకస్ పెడుతున్నాడు పవన్.
క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్, రాబిన్ హుడ్ తరహా పాత్ర చేస్తున్నాడు. బ్రిటీష్ ఖజానా కొల్లగొట్టి.. పేదలకు పంచే మంచి దొంగగా కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయట. అందుకే ఫ్రీగా మూమెంట్ ఉండాలంటే.. వెయిట్ తగ్గాలని డిసైడ్ అయ్యాడు పవన్. ఈ ఇదిలోనే వర్కవుట్లు మొదలుపెట్టాడు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ జిమ్ లో తెగ కష్టపడిపోతున్నాడు. యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా కండలు తిరిగిన బాడీని సొంతం చేసుకునేందుకు కృషి చేస్తున్నాడు. ఇప్పటికే లక్షలాది మంది సినీ అభిమానులను సొంతం చేసుకున్న ఆయన.. తన కొత్త సినిమాల్లో వైవిధ్యం చూపించేలా సిద్ధమవుతున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి