కరోనా తో అన్ని వ్యాపారాలు అటకెక్కాయి సుమారు 40 కోట్ల మంది భారతీయులు కరోనా విపత్తు తరువాత నిరుపేదలుగా మారిపోతున్నారు అన్న అంచనాలు వస్తూ ఉండటంతో మన భారత్ ఈ కరోనా దెబ్బ నుండి ఆర్ధికంగా తేరుకోవడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కీలక పాత్ర వహించే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే నష్టాలు ఎవరి అంచనాలకు అందని విధంగా ఉంది. 

 

ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీసే స్థాయికి ఎదిగిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి భవిష్యత్ లో ఇక భారీ సినిమాలు రావా అన్న సందేహాలకు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నాలుగు భారీ సినిమాల ఫలితం బట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆలోచనలు ఉంటాయి. ఈ నాలుగు సినిమాలలో మొదటి వరసలో నిలిచే మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’.


‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మళ్ళీ తెలుగువాడి సత్తా చూపెట్టాలి అని రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూడువందల కోట్లకు పైగా ఖర్చు పెడుతూ దేశంలోని 9 భాషలలో విడుదల చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీకి జరిగిన భారీ బడ్జెట్ రీత్యా అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరగడమే కాకుండా కరోనా ఉపద్రవం తరువాత విడుదల కాబోయే భారీ సినిమా కావడంతో ఈమూవీ ఫలితం బట్టి తెలుగు సినిమా నిర్మాతల ఆలోచనలు మారుతాయి.


ఇక ఈలిస్టులో రెండవ స్థానంలో వస్తోంది ప్రభాస్ జిల్ రాథా కృష్ణల భారీ బడ్జెట్ మూవీ. ఈ మూవీ ఎట్టి పరిస్థితులలోను ‘ఆర్ ఆర్ ఆర్’ కంటే ముందుగానే విడుదల అవుతుంది. ఈ మూవీకి వచ్చే ఓపెనింగ్ కలక్షన్స్ ను బట్టి ప్రేక్షకులు తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా భారీ సినిమాలు చూడటానికి వస్తారా రారా అన్న విషయానికి ఒక యాసిడ్ టెస్ట్ గా ప్రభాస్ లేటెస్ట్ మూవీ మారబోతోంది. అదేవిధంగా అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీని తెలుగు తమిళ కన్నడ మళయాళ హిందీ భాషలలో విడుదల చేయడానికి భారీ స్కెచ్ వేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ అయితే పూరీ దర్శకత్వంలో నటిస్తున్న తన ‘ఫైటర్’ మూవీని కూడ పాన్ ఇండియా మూవీగా మారుస్తున్నాడు. ఇలా ఈ నాలుగు సినిమాలు చేస్తున్న ప్రయత్నాల సక్సస్ ను బట్టి భవిష్యత్ లో టాలీవుడ్ నిర్మాతల నుండి పాన్ ఇండియా మూవీ నిర్మాణం జరుపుకుంటాయ లేదా అన్న విషయం తేలిపోతుంది అంటూ ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: