హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఇంకా మరేతర సినీ ఇండస్ట్రీ అయినా మీటూ సంఘటనలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. ఛాన్స్ ఇస్తానని చెప్పడం అమాయకపు యువతులను వాడుకొని వదిలేయడం సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క మగాడికి అలవాటైన పనే అని చెప్పుకోవచ్చు. బడా నిర్మాతలు, దర్శకులు చివరకి హీరోలు కూడా తమ కామ వాంఛలను తీర్చిన వారికి మాత్రమే తమ సినిమాలలో అవకాశాలు కల్పించడం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో బయటకి వచ్చి పెద్ద దుమారమే రేపాయి.


కానీ బాధితులైన నటీమణులు కొంతమంది బడా కామాంధుల పేర్లను బయట పెట్టక పోగా... చిన్మయి లాంటి ధైర్యం కలిగిన ప్రముఖులు పెద్ద వారి ముసుగులో ఉన్న వారి పేర్లను బయట పెట్టారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఖల్లాస్ సినిమాలో కథానాయికగా నటించి అత్యంత పాపులారిటీ సంపాదించిన ఓ బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ తనకి జరిగిన ఓ కిరాతకమైన సంఘటన గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.


తాను ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకి ఓ బడా బాలీవుడ్ స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చిందని... అయితే ఆ సినీ నిర్మాత తనకి ఒక రోజు ఫోన్ చేసి హీరో కి ఫోన్ చేయవలసిందిగా కోరాడని... అప్పుడు తాను ఆ హీరో కి ఫోన్ చేయగా... ' ఈరోజు రాత్రి నా రూముకి ఒంటరిగా రా. నీతో కొన్ని విషయాలు ఏకాంతంగా మాట్లాడాలి' అని ఫోన్ కట్ చేశాడని చెప్పింది.


అయితే ఈ విషయం గురించి నిశ్చింతగా ఆలోచించిన తనకు ఆ హీరో ఎందుకు రమ్మన్నాడో అర్థం అయిందని... వెంటనే ఆ హీరో కి ఫోన్ చేసి తాను అలాంటి దానిని కాదని చెప్పి చెడామడా తిట్టిపోసానని చెప్పుకొచ్చింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ బడా హీరో ఆమెను ఆ సినిమా నుంచి తప్పించి... బాగా క్లోజ్ గా ఉన్న మరో హీరోయిన్ ని తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. తనకు జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది కానీ ఆ బడా హీరో పేరు మాత్రం బయట పెట్టలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: