నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ లెజెండ్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. లెజెండ్ మూవీ దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కేవలం ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తవ్వడంతో ఇప్పుడు మిగిలిన ఆ ఒక్క పాటను షూటింగ్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే సింహా కాంబినేషన్ తరువాత వస్తున్న మూవీ కావడంతో లెజెండ్ మూవీ భారీ అంచానాలు నెలకొన్నాయి.
సింహా మూవీ ఎంతటి బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సాధించిందో అందరికి తెలుసు. అలాగే ఆ మూవీలోని ఐటెం సాంగ్ కూడ అంతే బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు లెజెండ్ మూవీలో బాలయ్య చేసే ఐటెం సాంగ్ పాపులర్ కానుంది. ఈ సాంగ్‌లో హంసానందిని చిందులేస్తుంది. అత్తారింటికి దారేది, మిర్చి, ఈగ వంటి సినిమాలలో తళుక్కున మెరిసిన తార హంసానందిని ఇప్పడు లెజెండ్ మూవీలోనూ ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఈ సాంగ్ తనకు మంచి బ్రేక్ ఇస్తుందని హంసానందిని చెబుతుంది.
దీనికి సంబంధించిన సాంగ్, ఈ నెల 5 నుండి అన్నపూర్ణ స్టూడియో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ పాట చిత్రీకరణతో లెజెండ్ మూవీ షూటింగ్ వంద శాతం పూర్తవుతుంది. ఇప్పటికే లెజెండ్ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిలీజ్ డేట్‌ను సైతం అనౌన్స్ చేయడంలో నందమూరి అభిమానులు లెజెండ్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: