యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు కానీ ఐదేళ్ల క్రితం కెరియర్ పెద్ద సందిగ్ధంలో ఉందని చెప్పొచ్చు. 2010 లో వచ్చిన అదుర్స్, బృందావనం సినిమాల తర్వాత శక్తి నుండి రభస వరకు ఆ ఐదేళ్లు తారక్ డేంజర్ జోన్ లోకి వెళ్ళాడు. ఓ పక్క మిగతా స్టార్స్ అంటా 50 కోట్లు 100 కోట్లు అంటూ బాక్సాఫీస్ పై సత్తా చాటుతుండగా ఎన్టీఆర్ మాత్రం వెనుకపడ్డాడు. ఇక దాదాపు కెరియర్ ముగిసింది అనుకునే టైం లో టెంపర్ సినిమా చేసి మరోసారి తన సత్తా చాటాడు ఎన్టీఆర్. 

 

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా టెంపర్. అప్పటికే ఆంధ్రావాలా ప్లాప్ అవగా ఆ కసితో తారక్ కు ఈసారి పక్కా హిట్టు ఇవ్వాల్సిందే అన్న జాగ్రత్తతో పూరిసినిమా చేశాడు. టెంపర్ ముందు వరకు మాట్లాడితే కట్టి పట్టి మూస ధోరణిలో సినిమాలు చేసిన ఎన్టీఆర్ టెంపర్ తర్వాత పూర్తిగా తాను చేసే సినిమాల స్టైల్ మార్చేశాడు. టెంపర్ తర్వాత నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు తారక్. సుకుమార డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాతో ఎన్టీఆర్ కొత్త ప్రయోగమే చేశాడు. 

 

ఇక కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ కూడా తారక్ కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక జై లవ కుశ సినిమా కూడా ఎన్టీఆర్ లోని నటుడిని మరోసారి ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించింది. మొదటిసారి త్రివిక్రమ్ తో చేసిన అరవింద సమేత సినిమాతో కూడా సత్తా చాటాడు. ఒకప్పుడు లౌడ్ వాయిస్ తో డైలాగ్స్ చెప్పే తారక్ ఇప్పుడు సెటిల్డ్ గా విలన్లకు వార్నింగ్ ఇవ్వడం చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. బాబాయ్ బాలయ్య బాబు లానే మాట్లాడితే ఫ్యాక్షన్ కథలు, రివెంజ్ డ్రామాలు చేసిన ఎన్టీఆర్ పంథా మార్చుకుని కొత్త కథలు చేయడం మొదలు పెట్టాడు. అందుకే ఇప్పుడు టాప్ లీగ్ లో ఉండగలిగాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్సినిమా తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: