తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. కానీ తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయిన సినిమాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇలా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలలో... ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ మెప్పించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేసిన సినిమా మిర్చి. మిర్చి సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

 


 మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్ అనుష్క లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా మొత్తం పగ కంటే మనిషి ప్రాణం ముఖ్యం అన్నది ముఖ్యంగా దర్శకుడు అందరికీ చెప్పాలనుకున్న మాట,  పగతో రగిలిపోతే  ఏమొస్తుంది... ఒకసారి ప్రేమించి  చూడు పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంటు ప్రభాస్ చెప్పిన డైలాగ్ తెలుగు ప్రేక్షకుల్లో  సరికొత్త ఆలోచనలు రేకెత్తించింది . అయితే ఎంత కఠినం గా ఉన్న మనిషి అయినా మారుతారు అంటూ ఈ సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగులు తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాయి అని చెప్పాలి. 

 


 ఈ సినిమా ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ని పంచుతూనే మరోవైపు కామెడీ తో కూడా కడుపుబ్బ నవ్విస్తుంది. మొత్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి ఎంతో సరదాగా ఈ సినిమాని చూడొచ్చు అని చెప్పాలి. సినిమాలోని ప్రతి సన్నివేశం తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తన తండ్రిని కాపాడడానికి కొడుకు చేసేది రిస్క్... కోపాన్ని కంట్రోల్ చేసుకుని అందరికీ ప్రేమను పంచడం నేర్పించే ప్రభాస్ నటన అందరినీ ఆకట్టుకొంది. మొత్తంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్  సినిమా గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: